News April 6, 2024

BREAKING: వైసీపీకి మరో షాక్

image

AP: ఎన్నికల వేళ వైసీపీ నుంచి వలసలు కొనసాగుతున్నాయి. ఆ పార్టీ పూతలపట్టు ఎమ్మెల్యే ఎం.ఎస్.బాబు కాంగ్రెస్‌లో చేరారు. ఏపీసీసీ చీఫ్ షర్మిల ఆయనకు కండువా కప్పి ఆహ్వానించారు. ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యేలు ఆర్థర్, ఎలీజా కాంగ్రెస్‌లో చేరారు.

News April 6, 2024

వారిద్దరితో రాజీనామా చేయించాలి: KTR

image

TG: బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఇద్దరు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని మాజీ మంత్రి KTR డిమాండ్ చేశారు. వారిని అనర్హులుగా ప్రకటించాలన్నారు. కాంగ్రెస్ లోక్‌సభ మేనిఫెస్టోలో MP లేదా MLA పార్టీ మారితే అనర్హత వేసేలా 10వ షెడ్యూల్ సవరణ ప్రస్తావనను ఆయన స్వాగతించారు. అయితే కాంగ్రెస్ ఎప్పటిలానే చెప్పేది ఒకటి.. చేసేది మరొకటని దుయ్యబట్టారు. ఇతర పార్టీల నేతల్ని చేర్చుకోవడం ఆ పార్టీనే ప్రారంభించిందన్నారు.

News April 6, 2024

హెచ్చరిక.. ఈ సమయంలో బయటకు రావొద్దు

image

TG: రాష్ట్రంలో ఎండల తీవ్రత ఎక్కువైన నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. నేడు, రేపు వడగాడ్పులు వీచే అవకాశం ఉండటంతో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ప్రజలు బయటకు రావొద్దని వార్నింగ్ ఇచ్చారు. అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ నెల 7 తర్వాత ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందన్నారు.

News April 6, 2024

నేడు సిసోడియా బెయిల్ పిటిషన్‌పై విచారణ

image

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈరోజు ఆప్ నేత మనీశ్ సిసోడియా బెయిల్ పిటిషన్‌పై ఈరోజు రౌస్ అవెన్యూ కోర్టు విచారించనుంది. ప్రస్తుతం ఆయన జుడీషియల్ కస్టడీలో ఉన్నారు. గతేడాది మార్చిలో అరెస్ట్ అయిన సిసోడియా పలుమార్లు కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దానిని ట్రయల్ కోర్టు, మరోసారి ఢిల్లీ హైకోర్టు, ఓసారి సుప్రీం కోర్టు ఆయన బెయిల్ అభ్యర్థనను కొట్టేశాయి.

News April 6, 2024

ఓటీటీలోకి వచ్చేసిన ‘రెబల్’ మూవీ

image

‘ప్రేమలు’ సెన్సేషన్ మమితా బైజూ, జీవీ ప్రకాశ్ జంటగా నటించిన చిత్రం ‘రెబల్’. గత నెల 22న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ ఓటీటీలో అందుబాటులోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్‌లో తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. వాస్తవిక సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా రూ.40 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.

News April 6, 2024

వర్త్ ‘కమిన్స్’ వర్త్

image

SRH కెప్టెన్‌గా కమిన్స్ అదరగొడుతున్నారు. ఐదేసి సార్లు ఛాంపియన్ అయిన CSK, MI వంటి దిగ్గజ టీమ్‌లను సొంత మైదానంలో మట్టికరిపించారు. గ్రౌండ్‌లో తనదైన వ్యూహాలతో కమిన్స్ ఆకట్టుకుంటున్నారు. దీంతో IPLలో రెండో అత్యధిక ధర రూ.20.50 కోట్లు పలికిన కమిన్స్ రాక SRH‌కు వర్త్ అని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. కెప్టెన్సీ రికార్డును కొనసాగిస్తూ కమిన్స్ SRH‌ను సీజన్ విజేతగా నిలపాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.

News April 6, 2024

మరికాసేపట్లో ‘మాస్ DJ’ అప్డేట్

image

‘టిల్లు స్క్వేర్’ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న నిర్మాత నాగవంశీ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఇవాళ ఉదయం 11.07 గంటలకు మాస్ డీజే అప్డేట్ ఉంటుందని.. వెయిట్ చేయాలని పేర్కొన్నారు. ఇప్పటికే ‘టిల్లు స్క్వేర్’కు సీక్వెల్‌గా ‘టిల్లు క్యూబ్’ రానున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో క్రేజీ అప్డేట్ ఏమై ఉంటుందా? అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

News April 6, 2024

కచ్చతీవు ద్వీపం ఇస్తాం.. కానీ!: శ్రీలంక

image

కచ్చతీవు ద్వీపాన్ని భారత్‌కు అప్పగించే ఉద్దేశం తమకు లేదని శ్రీలంక మంత్రి దేవానంద అన్నారు. కన్యాకుమారి సమీపంలోని వాడ్జ్ బ్యాంక్ ప్రాంతాన్ని అప్పగిస్తే కచ్చతీవును ఇస్తామని చెప్పారు. కాగా.. వాడ్జ్ బ్యాంక్ ప్రాంతంలో విలువైన వనరులుండటంతోనే భారత్ దాన్ని స్వాధీనం చేసుకుందని ఆరోపించారు. ఈ ద్వీపాన్ని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీలంకకు అప్పగించిందని ఇటీవల ప్రధాని మోదీ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

News April 6, 2024

BREAKING: భారీ ఎన్‌కౌంటర్

image

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో మరో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ములుగు జిల్లా కర్రిగుట్టలు, ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ పరిధిలో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు మావోయిస్టులు ఎదురుపడటంతో కాల్పులు చోటు చేసుకున్నాయి. దీంతో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. ఘటనాస్థలంలో 3 తుపాకులు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. 4 రోజుల క్రితం బీజాపూర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 13 మంది మావోయిస్టులు మరణించారు.

News April 6, 2024

రోహిత్ అంటే ఆ మాత్రం ఉంటుంది..

image

రోహిత్‌శర్మ అంటే IPL జట్లకు పీడకలే. ఆయన కెప్టెన్సీలో MI 5సార్లు ట్రోఫీ గెలుచుకుంది. ఆ టీమ్ కెప్టెన్ మారిన నేపథ్యంలో CSK బ్యాటింగ్ కోచ్ హస్సీ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ‘CSK ప్రస్తుతం ఏ జట్టు కెప్టెన్‌కు భయపడట్లేదు. గతంలో మమ్నల్ని ఫైనల్లో ఓడించే కెప్టెన్ ఉండేవారు. ఇప్పుడు ఆయన సారథిగా లేరు’ అని రోహిత్‌ను ఉద్దేశించి అన్నారు. హిట్‌మ్యాన్ అంటే ఆ మాత్రం ఉంటుందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.