India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్రంలో నూతన బార్ పాలసీ తీసుకొస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. క్యాబినెట్ సబ్ కమిటీ ఆధారంగా కొత్త బార్ పాలసీ ఉంటుందని వివరించారు. ‘ఆదాయమే కాదు.. ప్రజల ఆరోగ్యమూ ముఖ్యమే. ఆల్కహాల్ పర్సంటేజ్ తక్కువ గల మద్యం విక్రయాలతో నష్టం తగ్గించుకోవచ్చు. మద్యం వల్ల పేదల ఇళ్లు, ఒళ్లు గుల్ల కాకుండా చూడాలి. బార్లలోనూ గీత కార్మికులకు 10శాతం షాపులు కేటాయిస్తాం’ అని సీఎం వివరించారు.
TG: తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత లేకపోవడం వల్లే ఆ నిర్మాణాన్ని మేడిగడ్డకు మార్చినట్లు KCR అబద్ధం చెప్పారని ఉత్తమ్ పేర్కొన్నారు. తుమ్మిడిహట్టి వద్ద నీళ్లు ఉన్నాయని నాటి కేంద్ర జలమంత్రి ఉమా భారతి పేర్కొన్నా KCR పట్టించుకోలేదని PC ఘోష్ కమిషన్ గుర్తించిందన్నారు. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణం సరికాదని నిపుణుల కమిటీ సూచించినా గత ప్రభుత్వ పెద్దలు వినలేదని రిపోర్టులో స్పష్టం చేశారని ఉత్తమ్ వెల్లడించారు.
TG: కాళేశ్వరంపై ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ ‘KCR డిజైన్లు మార్చడంతో ప్రజాధనం దుర్వినియోగమైనట్లు ఘోష్ కమిషన్ తేల్చింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునాదుల్లోనే సమస్య ఉంది. రుణాలు తీసుకోవడంలోనూ KCR అవకతవకలకు పాల్పడ్డారు. ఘోష్ కమిషన్ 605 పేజీల నివేదిక ఇచ్చింది. ఇందులో హరీశ్‌రావు ప్రస్తావన 9సార్లు ఉంది’ అని వ్యాఖ్యానించారు.
TG: KCR స్వప్రయోజనాల కోసం కాళేశ్వరం నిర్మాణం జరిగిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఈ ప్రాజెక్టు కోసం NBFCల వద్ద అధిక వడ్డీలకు రుణాలు తెచ్చారని PC ఘోష్ కమిషన్ రిపోర్టులోని అంశాలను వివరించారు. అటు 16 లక్షల ఎకరాలకు నీరిచ్చేలా తుమ్మిడిహట్టి ప్రాజెక్టు నిర్మించాలని గతంలో నిర్ణయించారని, KCR CM అయ్యాక దాన్ని మేడిగడ్డకు మార్చారని వెల్లడించారు.
AP: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రేపు పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని APSDMA అంచనా వేసింది. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించింది. పిడుగులు పడే ఆస్కారం ఉన్నందున చెట్ల కింద ఉండరాదని సూచించింది. ఇవాళ సైతం పలు జిల్లాల్లో వర్షం కురిసింది. మీ ఏరియాలో వాన పడిందా?
TG: అచ్చంపేట బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు లేఖను పార్టీ అధినేత KCRకు పంపారు. భవిష్యత్ రాజకీయ కార్యాచరణపై ఆయన ప్రస్తుతం ఎటువంటి ప్రకటన చేయలేదు. కాగా, బాలరాజు బీజేపీలో చేరతారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
AP: నెల్లూరు DSP కార్యాలయంలో విచారణ అనంతరం మాజీ మంత్రి అనిల్‌కుమార్ మీడియాతో మాట్లాడారు. ‘నవ్వినా తప్పే అంటే ఏం చేయాలి? ప్రసన్నకుమార్‌కి మద్దతు తెలిపానని నాపై కేసు పెట్టి, A2గా చేర్చారు. నన్ను 36 ప్రశ్నలు అడిగారు. 10 నిమిషాల్లో సమాధానం రాసి ఇచ్చాను. 6 గంటలు కూర్చోబెట్టి విచారణ చేశారు. కూటమి నేతలు ఏ స్థాయికి దిగజారి పోయారో అర్థమవుతోంది’ అని విమర్శించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు గురించి PC ఘోష్ నివేదికపై అసెంబ్లీలో చర్చించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. చర్చ తర్వాత ఆ వ్యవహారంపై సిట్ లేదా సీబీఐ దర్యాప్తును కోరే అవకాశం ఉంది. అటు రిపోర్టులో అంశాలను మంత్రులకు ఉత్తమ్‌తో పాటు వివరించిన సీఎం రేవంత్ కాసేపట్లో ప్రెస్‌మీట్‌లో ప్రజలకు వివరాలు వెల్లడిస్తారు.
ఏపీలో మహిళలకు ఫ్రీ బస్ పథకాన్ని CM చంద్రబాబు ఈనెల 15న ప్రారంభిస్తారని మంత్రి రాంప్రసాద్ వెల్లడించారు. మహిళలు బస్సులో ఆధార్, రేషన్, ఓటరు కార్డుల్లో ఏదో ఒకటి చూపించాలన్నారు. అటు రద్దీ పెరిగితే స్కూల్ బస్సులు వినియోగిస్తామని తెలిపారు. పాఠశాలల వేళల్లో వాటిని వాడబోమన్నారు. 2 రోజుల్లో డ్రైవర్లు, మెకానిక్‌ల నియామకాలు చేపడుతామన్న మంత్రి, త్వరలోనే కారుణ్య నియామకాలు భర్తీ చేస్తామని వివరాలు వెల్లడించారు.
అనుభవం లేని టీమ్.. క్లీన్ స్వీప్ అయిపోతారు.. ENG సిరీస్‌కు ముందు INDపై చాలామంది అభిప్రాయాలివి. కానీ కుర్ర టీమ్ వారి అంచనాలు తలకిందులు చేస్తూ సిరీస్ మొత్తం అద్భుతంగా పోరాడింది. ప్రతి ఒక్కరు జట్టు కోసం తీవ్రంగా శ్రమించారు. గిల్-754 రన్స్, రాహుల్-532R, జడేజా 516R, పంత్ 479R, జైస్వాల్ 411R, సుందర్ 284R, సిరాజ్ 23W, బుమ్రా 14W, ప్రసిద్ధ్ 14W, ఆకాశ్ 13Wతో రాణించారు. సిరీస్ గెలవకపోయినా 2-2తో సమం చేశారు.
Sorry, no posts matched your criteria.