News October 3, 2024

ఉగ్ర దాడి: కొడుకును కాపాడి చనిపోయిన తల్లి!

image

ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌లో నిన్న జరిగిన టెర్రరిస్టుల కాల్పుల్లో 8 మంది మృతిచెందిన సంగతి తెలిసిందే. మృతుల్లో సెగెవ్ విగ్డర్ అనే 33ఏళ్ల మహిళ ఉన్నారు. ఆమె తన 9నెలల కొడుకును కాపాడుకునే క్రమంలో తూటాలకు బలయ్యారు. ఆమె కొడుకు ఆరి సురక్షితంగా ఉన్నాడని అధికారులు తెలిపారు. సెగెవ్ ఒక ఫిట్‌నెస్ స్టూడియో ఓనర్ అని, తన భర్త రిజర్వ్ సైనికుడిగా పనిచేస్తున్నారని స్థానిక మీడియా పేర్కొంది.

News October 3, 2024

ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు

image

AP: విజయవాడ ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి దసరా వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 12 వరకు 9 రోజుల్లో దుర్గమ్మ 9 రూపాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. రోజూ ఉ.4 నుంచి రా.11 వరకు భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. తొలిరోజైన నేడు మాత్రం ఉ.9 నుంచి దర్శనాలు ఆరంభమవుతాయి. భక్తుల కోసం 25 లక్షల లడ్డూలు సిద్ధం చేశారు. ఉచితంగా అన్నప్రసాదాలు పంపిణీ చేయనున్నారు. కృష్ణా ఘాట్ల వద్ద స్నానాల కోసం షవర్లు ఏర్పాటుచేశారు.

News October 3, 2024

రేషన్ కార్డుల దరఖాస్తులకు బ్రేక్!

image

TG: కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించాలన్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం మార్చుకుంది. ఈనెల 2 నుంచి దరఖాస్తులు స్వీకరించాల్సి ఉండగా, ఇందుకు సంబంధించిన ప్రక్రియను నిలిపివేసింది. ఫ్యామిలీ డిజిటల్ కార్డులు ఇవ్వనున్న నేపథ్యంలో ఇక రేషన్ కార్డులు అవసరం లేదని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు అధికారులు నేటి నుంచి 5 రోజులపాటు ఫ్యామిలీ డిజిటల్ కార్డుల పైలట్ ప్రాజెక్టు చేపట్టనున్నారు.

News October 3, 2024

నేటి నుంచి మహిళల టీ20 వరల్డ్ కప్

image

ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ యూఏఈ వేదికగా నేడు ప్రారంభం కానుంది. ఇవాళ రెండు మ్యాచులు జరగనున్నాయి. తొలి మ్యాచులో బంగ్లాదేశ్‌తో స్కాట్లాండ్, రెండో మ్యాచులో పాకిస్థాన్‌తో శ్రీలంక తలపడతాయి. రేపు సౌతాఫ్రికాVSవెస్టిండీస్, ఇండియాVSన్యూజిలాండ్ మ్యాచులు జరగనున్నాయి. ఈ మ్యాచులను స్టార్ స్పోర్ట్స్ టీవీ ఛానల్, డిస్నీ+హాట్ స్టార్ యాప్‌లో చూడవచ్చు.

News October 3, 2024

ఇలాంటి ప్రవర్తనను అందరూ ఖండించాలి: సుశాంత్

image

మంత్రి సురేఖ తన <<14254371>>వ్యాఖ్యల్ని<<>> వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలని సినీ హీరో సుశాంత్ డిమాండ్ చేశారు. ‘రాజకీయ ప్రత్యర్థికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న సమయంలో ఒక మంత్రి నా కుటుంబంతో పాటు సమంతను కించపరిచే విధంగా మాట్లాడటం విని షాక్ అయ్యాను. ఎవరినీ బాధపెట్టి ఇలా రాజకీయాల్లోకి లాగకూడదు. ఇలాంటి బాధ్యతారాహిత్య ప్రవర్తనను అందరూ ఖండించాలి’ అని ట్వీట్ చేశారు.

News October 3, 2024

నేటి నుంచి AP TET

image

AP: రాష్ట్రంలో నేటి నుంచి ఈనెల 21 వరకు టెట్ పరీక్షలు జరగనున్నాయి. రెండు సెషన్లలో (ఉ.9.30-మ.12, మ.2.30-సా.5) ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు. అభ్యర్థులు హాల్ టికెట్‌తో పాటు ఏదైనా గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకెళ్లాలి. హాల్ టికెట్‌లో తప్పులుంటే పరీక్షా కేంద్రంలోని అధికారులకు చూపించి సరిచేసుకోవచ్చు. ఈ పరీక్షలకు మొత్తం 4.27లక్షల మంది హాజరు కానున్నారు.

News October 3, 2024

మంత్రి సురేఖ క్షమాపణలు చెప్పాలి: నటి కుష్బూ

image

మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత, నటి కుష్బూ అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘సురేఖ గారూ.. మీలోని విలువలు ఏమైపోయాయి? బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మీరు సినీ పరిశ్రమపై భయంకరమైన, కించపరిచే ప్రకటనలు చేయరాదు. ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తే ఫిల్మ్ ఇండస్ట్రీ చూస్తూ కూర్చోదు. మీరు సినీ పరిశ్రమ మొత్తానికి, అందులోని మహిళలకు క్షమాపణలు చెప్పాలి’ అని X వేదికగా డిమాండ్ చేశారు.

News October 3, 2024

నిరాధార ఆరోపణలు చేస్తుంటే మౌనంగా చూస్తూ కూర్చోం: Jr.NTR

image

ఇతరులు తమపై నిరాధార ఆరోపణలు చేస్తుంటే మౌనంగా చూస్తూ కూర్చోలేమని Jr.NTR అన్నారు. నాగ చైతన్య-సమంత విడాకులపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ‘వ్యక్తిగత జీవితాలను రాజకీయాల్లోకి లాగొద్దు. బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవారు తప్పనిసరిగా గౌరవాన్ని, గోప్యతను పాటించాలి. సినీ పరిశ్రమ గురించి నిరాధారమైన ప్రకటనలు చేయడం బాధించింది. ఇలాంటి వాటిని ఫిల్మ్ ఇండస్ట్రీ సహించదు’ అని ట్వీట్ చేశారు.

News October 3, 2024

అమల ట్వీట్‌కు అక్కినేని అఖిల్ మద్దతు

image

మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై అక్కినేని అమల చేసిన <<14257006>>ట్వీట్‌కు<<>> అఖిల్ స్పందించారు. ‘అమ్మ.. మీ ప్రతి మాటకు నేను మద్దతు ఇస్తున్నాను. ఇలాంటి అర్థం లేని విషయంపై మీరు స్పందించాల్సి వచ్చినందుకు విచారం వ్యక్తం చేస్తున్నా. కానీ కొన్నిసార్లు ఇలాంటి సామాజిక విద్రోహుల వ్యాఖ్యలపై స్పందించడం తప్ప మనకు వేరే మార్గం లేదు’ అని ట్వీట్ చేశారు.

News October 3, 2024

మంత్రి సురేఖ వ్యాఖ్యలు.. స్పందించిన హీరో నాని

image

చైతూ-సమంత విడాకులపై మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలపై హీరో నాని స్పందించారు. ‘తాము ఏం మాట్లాడినా తప్పించుకోవచ్చని పొలిటీషియన్లు అనుకోవడం చూస్తుంటే అసహ్యం వేస్తుంది. మీ మాటలే ఇంత బాధ్యతారహితంగా ఉన్నప్పుడు, ప్రజల పట్ల మీకు బాధ్యత ఉంటుందని ఆశించడం మూర్ఖత్వమే అవుతుంది. గౌరవ ప్రదమైన హోదాలో ఉన్న వ్యక్తి మీడియా ముందు ఇలా నిరాధారమైన మాటలు మాట్లాడడం సరైంది కాదు. దీనిని అందరూ ఖండించాలి’ అని ట్వీట్ చేశారు.