News April 23, 2025
పహల్‌గామ్ దాడి.. కావలి వ్యక్తి బాడీలో 42 బుల్లెట్లు!

పహల్‌గామ్ దాడి ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన నెల్లూరు జిల్లా కావలికి చెందిన మధుసూధన్ రావు శరీరంలో 42 బుల్లెట్లు ఉన్నట్లు తెలుస్తోంది. AK-47తో ఆయనను వెంటాడి వేటాడి చంపినట్లు సమాచారం. కాగా మధు బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. హాలిడే ట్రిప్ కోసం తన ఫ్యామిలీతో కలిసి ఆయన కశ్మీర్ పర్యటనకు వెళ్లి ముష్కరుల చేతిలో ప్రాణాలు కోల్పోయారు.
Similar News
News August 9, 2025
రాఖీ కట్టని కవిత, షర్మిల

తెలుగు రాష్ట్రాల్లో క్రియాశీలక నేతలుగా ఉన్న కవిత, షర్మిల తమ సోదరులకు ఈ ఏడాది రాఖీ కట్టలేదు. ప్రతి ఏటా తమ అనుబంధాన్ని చాటే కేటీఆర్-కవిత ఈ సారి వేడుకలకు దూరంగా ఉన్నారు. కేటీఆర్ కూడా అందుబాటులో లేరని తెలుస్తోంది. మరోవైపు మాజీ సీఎం జగన్, ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మధ్య రాజకీయ వైరంతో దూరం పెరిగింది. దీంతో గతేడాది మాదిరే ఇవాళ కూడా జగన్‌కు షర్మిల రాఖీ కట్టలేదు.
News August 9, 2025
ఒక్క విమానమూ కూలలేదు: పాక్ రక్షణ మంత్రి

ఆపరేషన్ సిందూర్‌లో పాక్‌కు చెందిన 6 విమానాలను <<17350664>>కూల్చేశామని<<>> IAF చీఫ్ మార్షల్ AP సింగ్ వెల్లడించిన విషయం తెలిసిందే. దీనిని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఖండించారు. ‘ఒక్క పాక్ విమానాన్నీ ఇండియా కూల్చలేదు. 3 నెలల నుంచి వారేం మాట్లాడలేదు. కానీ మేము ఇంటర్నేషనల్ మీడియాకు అన్నీ వివరించాం. ఒకవేళ నమ్మకం లేకుంటే దీనిపై స్వతంత్ర విచారణ జరిపించాలి. అయినా భారత్ నిజాన్ని బయటకి రానివ్వదు’ అని వ్యాఖ్యానించారు.
News August 9, 2025
ట్రంప్, పుతిన్ భేటీ.. స్వాగతించిన భారత్

US, రష్యా ప్రెసిడెంట్స్ ట్రంప్, పుతిన్ ఈ నెల 15న అలాస్కాలో భేటీ కానున్న విషయం తెలిసిందే. దీనిపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. ‘US, రష్యన్ ఫెడరేషన్ అలాస్కాలో సమావేశమయ్యేందుకు ముందుకు రావడాన్ని ఇండియా స్వాగతిస్తోంది. ఈ భేటీతో యుద్ధానికి తెరపడి ఉక్రెయిన్‌లో శాంతికి దారులు తెరుచుకునే అవకాశం ఉంది. ఇది యుద్ధాల యుగం కాదని PM మోదీ ఇప్పటికే చాలా సందర్భాల్లో చెప్పారు’ అని ఓ ప్రకటన విడుదల చేసింది.