News April 23, 2025

పహల్‌గామ్‌@మినీ స్విట్జర్లాండ్.. తెలుగు సినిమాల షూటింగ్

image

ఉగ్రవాదుల నరమేధంతో పహల్‌గామ్ పేరు దేశవ్యాప్తంగా విన్పిస్తోంది. ఇక్కడి ప్రకృతి అందాల వల్ల దీనికి మినీ స్విట్జర్లాండ్ అని పేరు వచ్చింది. కాగా, పహల్‌గామ్ అద్భుతమైన లొకేషన్లలో అల్లుఅర్జున్ ‘నా పేరు సూర్య’, నటుడు శ్రీకాంత్ కుమారుడు రోషన్ ‘పెళ్లి సందD’, విజయ్ దేవరకొండ ‘ఖుషీ’ సినిమాల షూటింగ్ జరిగింది. స్విట్జర్లాండ్‌ను తలపించే అందాలు, బడ్జెట్ కారణాల రీత్యా నిర్మాతలు ఇక్కడ షూటింగ్‌కు మొగ్గు చూపుతుంటారు.

Similar News

News August 9, 2025

JGTL: తండ్రి సమాధికి రాఖీ కట్టిన కుమార్తె

image

గొల్లపల్లి మండలం భీంరాజ్‌పల్లి గ్రామానికి చెందిన బొమ్మెన మాధవి పెద్దపల్లి జిల్లా రాంపల్లికి చెందిన తన తండ్రి రాజయ్య సమాధికి రాఖీ కట్టి తండ్రీకూతుళ్ల అనుబంధాన్ని మరోసారి గుర్తుచేసింది. రెండేళ్ల క్రితం రాజయ్య హఠాన్మరణం చెందారు. ఏటా తన తండ్రికి కూతురు రాఖీ కట్టడానికి వెళ్లేది. తండ్రి భౌతికంగా లేకపోవడంతో సమాధి వద్దకు వెళ్లి రాఖీ కట్టింది. తద్వారా రక్షాబంధన్‌కు ఉన్న గొప్పతనాన్ని చాటి చెప్పింది.

News August 9, 2025

రికార్డు స్థాయిలో భారత రక్షణ ఉత్పత్తులు

image

భారత డిఫెన్స్ ప్రొడక్షన్ సరికొత్త రికార్డు సృష్టించింది. 2024-25లో రక్షణ ఉత్పత్తుల విలువ రూ.1,50,590 కోట్లకు చేరింది. ఈ మేరకు డిఫెన్స్ మినిస్ట్రీ ఓ ప్రకటన విడుదల చేసింది. గతేడాది రూ.1.27 లక్షల కోట్లు ఉన్న ప్రొడక్షన్ వాల్యూ ఇప్పుడు 18 శాతం పెరిగింది. మొత్తం ఉత్పత్తుల్లో పబ్లిక్ సెక్టార్ వాటానే 77% కావడం విశేషం. దిగుమతులు తగ్గించుకుని ఇతర దేశాలకు రక్షణ ఉత్పత్తులు ఎగుమతి చేసే దిశగా భారత్ సాగుతోంది.

News August 9, 2025

రాఖీ కట్టని కవిత, షర్మిల

image

తెలుగు రాష్ట్రాల్లో క్రియాశీలక నేతలుగా ఉన్న కవిత, షర్మిల తమ సోదరులకు ఈ ఏడాది రాఖీ కట్టలేదు. ప్రతి ఏటా తమ అనుబంధాన్ని చాటే కేటీఆర్-కవిత ఈ సారి వేడుకలకు దూరంగా ఉన్నారు. కేటీఆర్ కూడా అందుబాటులో లేరని తెలుస్తోంది. మరోవైపు మాజీ సీఎం జగన్‌, ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మధ్య రాజకీయ వైరంతో దూరం పెరిగింది. దీంతో గతేడాది మాదిరే ఇవాళ కూడా జగన్‌కు షర్మిల రాఖీ కట్టలేదు.