News September 24, 2025

పహల్గాం ఉగ్రదాడి.. టెర్రరిస్టులకు సహకరించిన వ్యక్తి అరెస్ట్!

image

పహల్గాం ఉగ్రదాడిలో టెర్రరిస్టులకు సాయం చేసినట్లు భావిస్తున్న ఓ వ్యక్తిని J&K పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఆపరేషన్ మహదేవ్‌లో ఇటీవల పలువురు టెర్రరిస్టులను సైన్యం మట్టుబెట్టిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఘటనాస్థలిలో సేకరించిన ఫోరెన్సిక్ ఆధారాలను బేస్ చేసుకొని మహ్మద్ కటారియా అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రవాదుల కదలికలను కనిపెట్టేందుకు ఇతడి అరెస్టు కీలకమని పోలీసులు భావిస్తున్నారు.

Similar News

News September 25, 2025

గ్రూప్-1 తుది ఫలితాలు విడుదల

image

TG: గ్రూప్-1 విషయంలో సింగిల్ బెంచ్ తీర్పుపై డివిజన్ బెంచ్ <<17813238>>స్టే<<>> విధించిన క్రమంలో TGPSC ఫైనల్ రిజల్ట్‌ను విడుదల చేసింది. మొత్తం 563 పోస్టులకు 562 మంది అభ్యర్థులు ఎంపికైనట్లు తెలిపింది. కోర్టు కేసు కారణంగా ఒక్క పోస్ట్ ఫలితం పెండింగ్‌లో ఉంచినట్లు పేర్కొంది. అభ్యర్థుల జాబితా కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News September 25, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (సెప్టెంబర్ 25, గురువారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 4.53 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.05 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.08 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.29 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.10 గంటలకు
✒ ఇష: రాత్రి 7.22 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News September 25, 2025

హైడ్రాకు భారీగా నిధుల విడుదల

image

TG: విపత్తు నిర్వహణ కోసం ఏర్పాటైన హైడ్రాకు ప్రభుత్వం రూ.69 కోట్ల నిధులు విడుదల చేసింది. అత్యవసర అవసరాలను దృష్టిలో పెట్టుకొని అదనపు నిధులు రిలీజ్ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో పాటు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం GHMC నుంచి మ్యాచింగ్ గ్రాంట్స్ కింద రూ.20 కోట్లు విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ నిధులతో హైడ్రా మరింత సమర్థవంతంగా పనిచేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.