News February 20, 2025
పాక్ ఫసక్! ముక్కలవ్వడం పక్కా!

పాకిస్థాన్ 4 ముక్కలయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్టు వార్, జియోపొలిటికల్ నిపుణుల అంచనా. మరికొన్ని రోజుల్లో బలూచిస్థాన్ స్వతంత్రం ప్రకటించుకోవచ్చని వారు అంటున్నారు. పాక్ పార్లమెంటులో దీనిపై చర్చించడాన్ని ఉదహరిస్తున్నారు. ఇదే జరిగితే ఆ దేశం 30% భూమి కోల్పోవడం ఖాయమే. మరోవైపు బుల్లెట్లు పేల్చకుండానే PoKను స్వాధీనం చేసుకొనేందుకు భారత్ సిద్ధమైందని, సౌదీ, ఖతర్ అడ్డుచెప్పకుండా పావులు కదిపిందని చెప్తున్నారు.
Similar News
News February 3, 2026
క్యాబినెట్ భేటీ: ‘నెయ్యి కల్తీ’పై 2 గంటలు PPT

AP: క్యాబినెట్ మీటింగ్ అనేసరికి అధికారులు పలు అంశాలతో అజెండాను రెడీ చేస్తుంటారు. మంత్రివర్గమూ సుదీర్ఘంగా వాటిని చర్చిస్తుంది. అయితే ఇవాళ్టి భేటీలో మాత్రం శ్రీవారి లడ్డూ నెయ్యి కల్తీ వ్యవహారం ఒక్కదానిపైనే చర్చించింది. నెయ్యి కల్తీపై దాదాపు 2 గంటలు PPT ప్రజెంటేషన్‌తో CM వివరించారు. సిట్ పేర్కొన్న అంశాలను లోతుగా విశ్లేషించారు. తెరవెనుక వ్యక్తులెవరో కూడా తేల్చాలని నిర్ణయించినట్లు సమాచారం.
News February 3, 2026
అదానీ గ్రూప్ షేర్ల జోరు.. ఒక్కరోజే ₹లక్ష కోట్ల లాభం!

US టారిఫ్స్‌ను తగ్గిస్తున్నట్లు ప్రకటించడంతో అదానీ గ్రూప్ షేర్లు దూసుకెళ్లాయి. నేటి ట్రేడింగ్‌లో అదానీ గ్రీన్ ఎనర్జీ అత్యధికంగా 12.87% లాభపడగా అదానీ ఎంటర్‌ప్రైజెస్ 11.89%, అదానీ ఎనర్జీ 10% వరకు పెరిగాయి. సుంకాల తగ్గింపు వల్ల ఆ గ్రూప్ ఆదాయాలు పెరుగుతాయనే అంచనాలు ర్యాలీకి కారణమయ్యాయి. ఒక్క రోజులోనే అదానీ గ్రూప్ మొత్తం మార్కెట్ విలువ దాదాపు ₹లక్ష కోట్లకు పైగా పెరిగి ₹13.78 లక్షల కోట్లకు చేరుకుంది.
News February 3, 2026
రాత్రి పడుకునే ముందు ఇలా చేస్తే..

రోజూ రాత్రి నిద్రపోయే ముందు ఓ లవంగం మొగ్గను నమిలితే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందంటున్నారు. ఒత్తిడి తగ్గి మంచి నిద్ర వస్తుందని పేర్కొంటున్నారు. అలాగే రాత్రి భోజనానికి అరగంట ముందు గోరు వెచ్చని నీరు తాగితే ఆహారం సులభంగా అరుగుతుందని చెబుతున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ టీ, కాఫీ లాంటివి తీసుకోవద్దని హెచ్చరిస్తున్నారు.


