News November 30, 2024

పాక్ ఓపెనర్ భారీ శతకం.. IND టార్గెట్ ఎంతంటే?

image

U-19 ఆసియా కప్‌లో భాగంగా భారత్‌తో మ్యాచ్‌లో పాకిస్థాన్ 281/7 పరుగులు చేసింది. ఆ జట్టు ఓపెనర్ షహ్‌జైద్ భారీ సెంచరీతో అదరగొట్టారు. అతడు 147 బంతుల్లో 10 సిక్సర్లు, 5 ఫోర్లతో 159 రన్స్ చేశారు. మరో ఓపెనర్ ఉస్మాన్ ఖాన్ 60 రన్స్‌తో రాణించారు. భారత బౌలర్లలో సమర్త్ నాగరాజ్ 3, ఆయుష్ మాత్రే 2 వికెట్లు పడగొట్టారు. IND విజయానికి 282 రన్స్ అవసరం.

Similar News

News March 24, 2026

నామినేటెడ్ పోస్టుల భర్తీపై కసరత్తు పూర్తి?

image

తెలంగాణలో నామినేటెడ్ పోస్టుల భర్తీకి ముహూర్తం ఫిక్స్ అయినట్లు సమాచారం. నిన్న అసెంబ్లీ హాలులో CM రేవంత్, PCC చీఫ్ మహేశ్, కీలక మంత్రులు ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించారు. AICC ఆమోదం లభిస్తే ఈ నెలాఖరులోగా లిస్టును ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గ్రౌండ్ లెవల్లో పార్టీ కోసం శ్రమించిన ద్వితీయ శ్రేణి నాయకులకు, సామాజిక సమీకరణాలను బ్యాలెన్స్ చేస్తూ పదవులు కట్టబెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

News March 24, 2026

కరెంట్ అఫైర్స్

image

* ప్రపంచ వారసత్వ జాబితాలో సారనాథ్, మేఘాలయలోని లివింగ్ రూట్ బ్రిడ్జెస్‌ను చేర్చాలని UNESCOకు ప్రతిపాదన.
* భారత్-సీషెల్స్ మధ్య ‘ఎక్సర్‌సైజ్ లామిటియే’ 11వ ఎడిషన్ పూర్తి. లామిటియే అంటే స్నేహం.
* వరల్డ్ బెస్ట్ ఎయిర్‌పోర్ట్-సింగపూర్ ఛాంగి ఎయిర్‌పోర్ట్. ఢిల్లీ ఇందిరాగాంధీ ఎయిర్‌పోర్టుకు 28వ స్థానం.
* జలంధర్‌లోని ఆదంపుర్ విమానాశ్రయానికి ‘శ్రీగురు రవిదాస్ మహారాజ్ ఎయిర్‌పోర్టు’గా పేరు మార్పు. SHARE IT

News March 24, 2026

IPL కోసం BCCI కఠినమైన రూల్స్!

image

IPL 2026 కోసం BCCI కఠినమైన కొత్త గైడ్‌లైన్స్‌ను విడుదల చేసినట్లు సమాచారం. ఇకపై ప్లేయర్లు తమ ఫ్యామిలీతో కాకుండా కేవలం టీమ్ బస్సులోనే ప్రయాణించాలని కండిషన్ పెట్టినట్లు క్రిక్‌బజ్ పేర్కొంది. మ్యాచ్ రోజుల్లో ప్రాక్టీస్ సెషన్లపై నిషేధం విధించింది. డ్రెస్సింగ్ రూమ్‌లోకి ఫ్యామిలీ ఎంట్రీని నిలిపివేసింది. పిచ్‌లను కాపాడటం, బ్రాడ్‌కాస్టింగ్ క్వాలిటీని పెంచడం కోసమే ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.