News September 23, 2025
రెచ్చగొట్టేలా పాక్ ప్లేయర్ల సెలబ్రేషన్స్.. ఇర్ఫాన్ ఫైర్

భారత్‌తో మ్యాచ్‌లో పాక్ ప్లేయర్లు రవూఫ్, ఫర్హాన్ <<17788891>>రెచ్చగొట్టేలా<<>> సెలబ్రేషన్స్ చేసుకోవడంపై భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఫైరయ్యారు. ‘ఇరు దేశాల మధ్య పరిస్థితి తెలిసి కూడా ఇలా చేయడం అనవసరం. దీని ద్వారా వారిద్దరి క్యారెక్టర్, పెంపకం ఏంటో అర్థమవుతోంది. మరీ ఇంత దిగజారిపోవడం సరికాదు. వారి ప్రవర్తన నాకేమీ ఆశ్చర్యంగా అనిపించలేదు. ఇలాంటివి పాక్ ప్లేయర్లకు అలవాటే’ అని మండిపడ్డారు.
Similar News
News September 23, 2025
ఒరాకిల్ చేతికి టిక్‌టాక్

చైనాకు చెందిన పాపులర్ SM యాప్ టిక్‌టాక్‌ను USలో ఒరాకిల్ ఆపరేట్ చేయనుంది. త్వరలో ఈ ఒప్పందంపై ట్రంప్ సంతకం చేస్తారని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలినా లెవిట్ ప్రకటించారు. ప్రభుత్వంతో కలిసి ఒరాకిల్ పనిచేస్తుందన్నారు. సంస్థలోని మెజారిటీ షేర్లు అమెరికన్ ఇన్వెస్టర్ల చేతిలోకి వస్తాయన్నారు. నేషనల్ సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీ కనుసన్నల్లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ యాప్‌ను కంట్రోల్ చేస్తారని పేర్కొన్నారు.
News September 23, 2025
SBIలో స్పెషలిస్ట్ పోస్టులు

<
News September 23, 2025
మీరే బకాయిలు పెట్టి మమ్మల్ని అంటారా: లోకేశ్

AP: శాసన మండలిలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై చర్చ సందర్భంగా YCP నేత బొత్సపై మంత్రి లోకేశ్ మండిపడ్డారు. ‘మీరే బకాయిలు పెట్టి మమ్మల్ని అంటారా? సీనియర్ నేత అయ్యుండి బీఏసీలో ఎందుకు మాట్లాడలేదు? నన్ను డిక్టేట్ చేయడం సరికాదు’ అని ఆగ్రహించారు. తమ హయాంలో బకాయిలు పెట్టలేదని, లోకేశ్ మాటలు సరిగాలేవని బొత్స బదులిచ్చారు. కాగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై YCP ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని ఛైర్మన్ తిరస్కరించారు.