News February 27, 2025
పాకిస్థాన్, బంగ్లాదేశ్ మ్యాచ్ రద్దు

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్థాన్, బంగ్లాదేశ్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. టాస్ కూడా పడకముందే వర్షం ఆరంభమైంది. ఎంతకీ వాన తగ్గకపోవడంతో ఆటను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. కాగా ఈ టోర్నీలో పాక్, బంగ్లా జట్లు ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓడాయి. దీంతో ఇరు జట్లు ఒక్క విజయం కూడా నమోదు చేయకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించాయి.
Similar News
News February 27, 2025
నీటిని జాగ్రత్తగా వాడుకోండి.. AP, TGలకు KRMB సూచన

తెలుగు రాష్ట్రాల ఈఎన్సీలతో కేఆర్ఎంబీ సమావేశం ముగిసింది. శ్రీశైలం, నాగార్జున సాగర్‌లో తక్కువ నీరు ఉన్నందున వృథా కాకుండా జాగ్రత్తగా వాడుకోవాలని సూచించింది. తాగు, సాగు నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలంది. 15 రోజులకోసారి ఇరు రాష్ట్రాల అధికారులు పరిస్థితులను సమీక్షించుకోవాలని ఆదేశించింది. రెండు ప్రాజెక్టుల నుంచి తమకు 55TMCలు కావాలని ఏపీ, 63TMCలు ఇవ్వాలని తెలంగాణ కోరిన విషయం తెలిసిందే.
News February 27, 2025
$: సెంచరీ దిశగా..!

అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత కరెన్సీ రూపాయి విలువ రికార్డు స్థాయిలో పతనమవుతోంది. పది సంవత్సరాల్లో రూపాయి విలువ ఎంతలా పడిపోయిందో ఓ నెటిజన్ వివరించారు. 2015లో ఒక్క డాలర్‌కు రూ.65.87 కాగా ఇది 2020లో రూ.73.78కి చేరింది. 2024లో రూ.84.79 ఉండగా ఈరోజు డాలర్ విలువ రూ.87.17గా ఉంది. రోజురోజుకీ పెరుగుతూ పోతుండటంతో ఇది త్వరలోనే రూ.100కు చేరే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
News February 27, 2025
SHOCK: ఇడ్లీ శాంపిల్స్‌లో క్యాన్సర్ కారకాలు

హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ ఇడ్లీల్లో కార్సినోజెనిక్స్(క్యాన్సర్ కారకాలు) ఉండటం కర్ణాటకలో దుమారం రేపింది. దీంతో వాటి తయారీలో ప్లాస్టిక్ వాడకాన్ని ప్రభుత్వం నిషేధించింది. ఇడ్లీ ప్లేటులో పిండి వేశాక దానిపై క్లాత్ బదులు ప్లాస్టిక్ షీట్లు వేస్తున్నట్టు ఫిర్యాదులు రావడంతో 251 శాంపిల్స్‌ను పరీక్షించారు. 52 హోటళ్లు ప్లాస్టిక్ వాడినట్టు తేలింది. దీంతో AP, TGలోనూ తనిఖీ చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.