News January 6, 2025

సౌతాఫ్రికా చేతిలో పాక్‌ క్లీన్‌స్వీప్

image

పాకిస్థాన్‌తో జరిగిన రెండో టెస్టులో సౌతాఫ్రికా 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో రెండు టెస్టుల సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఫాలోఆన్ ఆడిన పాక్ రెండో ఇన్నింగ్స్‌లో 478 పరుగులకు ఆలౌటైంది. జట్టులో మసూద్(145) సెంచరీతో చెలరేగారు. బాబర్ ఆజమ్(81) రాణించారు. 58రన్స్‌ టార్గెట్‌తో బరిలోకి దిగిన ప్రొటీస్ 7 ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్ బెడింగ్‌హామ్ (30 బంతుల్లో 47) టీ20 తరహాలో బ్యాట్ ఝుళిపించారు.

Similar News

News January 25, 2026

నేడు ఆదిత్య హృదయం ఎందుకు పఠించాలి?

image

సూర్యారాధన వల్ల అసాధ్యమైన పనులు కూడా సుసాధ్యమవుతాయని నమ్మకం. రామాయణ యుద్ధంలో అలసిన రాముడికి అగస్త్యుడు ‘ఆదిత్య హృదయం’ బోధించారని పురాణాలు చెబుతున్నాయి. దీన్ని పఠిస్తే లభించిన శక్తితోనే రాముడు రావణుడిని సంహరించగలిగాడని నమ్ముతారు. అలాగే మయూరుడు అనే కవి సూర్యుని స్తుతించి కుష్టు వ్యాధి నుంచి విముక్తుడయ్యాడు. పాండవులు అరణ్యవాసంలో సూర్యుని అనుగ్రహంతోనే ‘అక్షయపాత్ర’ను పొంది అతిథి సత్కారాలు చేయగలిగారు.

News January 25, 2026

పోలవరం నిర్వాసితులకు పరిహారం ఎప్పుడంటే?

image

AP: పోలవరం ప్రాజెక్ట్ ఫస్ట్ ఫేజ్ నిర్వాసితులకు జూన్‌లోగా పరిహారం ఇవ్వాలని జలవనరుల శాఖ నిర్ణయించింది. మొత్తం 21,709 కుటుంబాలకు పరిహారం అందజేసేందుకు రూ.2,497.98 కోట్లు అవసరం అని అంచనా వేసింది. 2027 మార్చి నాటికి ప్రాజెక్టు తొలిదశ పనులను, ఈ ఏడాది డిసెంబర్‌లోగా పునరావాస కాలనీల నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటివరకు 28 కాలనీలు పూర్తవగా మరో 49 కాలనీల పనులు పూర్తి కావాల్సి ఉంది.

News January 25, 2026

రథ సప్తమి గురించి ‘యోగశాస్త్రం’ ఏం చెబుతుందంటే..?

image

యోగశాస్త్రం ప్రకారం మన శరీరంలో ఇడా, పింగళ అనే 2 నాడులుంటాయి. ఇందులో పింగళ నాడి సూర్య నాడికి సంకేతం. ప్రాణాయామం ద్వారా ఈ నాడులను శుద్ధి చేసినప్పుడు కుండలినీ శక్తి మేల్కొంటుంది. సూర్యుడు బాహ్య ప్రపంచానికి వెలుగునిస్తే, యోగ సాధన ద్వారా మనలోని చిదాత్మ ప్రకాశిస్తాడు. రథసప్తమి నాడు చేసే సాధన మనలోని ఈ అంతర్గత శక్తిని మేల్కొల్పుతుంది. అందుకే ఈ పర్వదినాన కొద్దిసేపైనా యోగా చేయాలని పండితులు సూచిస్తారు.