News December 24, 2024
పాక్‌కు చైనా నుంచి 40 యుద్ధవిమానాలు

పాకిస్థాన్ తన సైన్యాన్ని మరింత బలోపేతం చేస్తోంది. చైనాకు చెందిన 40 జే-35 స్టెల్త్ ఫైటర్ జెట్లను తాజాగా కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతోంది. వచ్చే రెండేళ్లలో చైనా వీటిని దశలవారీగా డెలివరీ చేయనుంది. ఈ డీల్ విలువ ఎంత అన్నది రహస్యంగా ఉంచారు. ఐదో తరం విమానమైన జే-35ని చైనా ఇప్పటి వరకూ వేరే దేశాలకు విక్రయించలేదు. అమెరికాకు చెందిన ఎఫ్-35 జెట్స్‌కు పోటీగా వీటిని తయారుచేసినట్లు చైనా వర్గాలు చెబుతున్నాయి.
Similar News
News November 28, 2025
HYD: ‘సృష్టి’ కేసులో డా.నమ్రతకు బెయిల్ మంజూరు

సికింద్రాబాద్ సృష్టి ఫర్టిలిటీ కేసులో సంచలన మలుపు తిరిగింది. సరోగసీ పేరుతో అక్రమాలు, నకిలీ పత్రాల సృష్టి, శిశువుల కొనుగోలు, విక్రయాల ఆరోపణల నడుమ ప్రధాన నిందితురాలు డా.నమ్రతకు బెయిల్ మంజూరు అయ్యింది. ప్రత్యేక దర్యాప్తు బృందం ఇప్పటికే పలు కీలక ఆధారాలు సేకరించింది. కాగా బెయిల్ మంజూరవ్వడంతో కేసులో కొత్త చర్చలకు దారితీసింది.
News November 28, 2025
సర్పంచ్‌గా మొదలై.. 5 సార్లు MLAగా గుమ్మడి నర్సయ్య

ఖమ్మం(D) సింగరేణి(M) టేకులగూడేనికి చెందిన గుమ్మడి నర్సయ్య రాజకీయాల్లో సుపరిచితం. ఆయన రాజకీయ జీవితం మొదటగా సొంత గ్రామానికి సర్పంచ్‌గా మొదలైంది. ఆ తర్వాత ఇల్లందు నుంచి CPI ML న్యూడెమోక్రసీ తరఫున ఏకంగా 5 సార్లు MLAగా గెలిచి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. నిస్వార్థ, నిరాడంబర ప్రజానేతగా పేరుగాంచిన గుమ్మడి నర్సయ్య జీవితం, నేడు స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు నిజంగా ఆదర్శనీయం కదూ.
News November 28, 2025
సూర్యాపేట వాసికి నేషనల్ ఫార్మా అవార్డు

సూర్యాపేట వాసి డా.అనంతుల రవి శేఖర్‌కు జాతీయ స్థాయి గౌరవం దక్కింది. ఢిల్లీలో జరిగిన ఫార్మా క్వాలిటీ ఎక్సలెన్స్ అవార్డ్స్-2025 వేడుకలో ఆయనకు నేషనల్ ఇండియా ఫార్మా అవార్డు వరించింది. శాస్త్రవేత్తగా చేసిన ప్రయోగాత్మక సేవలకు సీపీహెచ్ఐ ఆర్గనైజింగ్ ఈ అవార్డును ప్రదానం చేసింది. ఈ అవార్డు రావడం ఎంతో గర్వకారణమని, భవిష్యత్తులో మరిన్ని ప్రయోగాలు చేస్తానని రవి శేఖర్ తెలిపారు.


