News February 27, 2025
PAKISTAN: ఆదాయం 6.. ఖర్చు 60..!

ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణకు పాకిస్థాన్ భారీగా ఖర్చు చేసింది. దాదాపు రూ.591 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ఒక్క మ్యాచూ గెలవకుండానే లీగ్ దశలోనే ఆ జట్టు ఇంటిబాట పట్టింది. గ్రూప్ స్టేజీలో ఓడిన జట్లకు ఐసీసీ రూ.2.3 కోట్లు మాత్రమే ఇవ్వనుంది. ఇది చూసిన నెటిజన్లు పీసీబీపై ట్రోల్స్ చేస్తున్నారు. ఆదాయం 6.. ఖర్చు 60 అంటూ ఎగతాళి చేస్తున్నారు. ఇకనైనా పీసీబీ తీరు మారాలని కామెంట్లు చేస్తున్నారు.
Similar News
News February 27, 2025
దేశంలోనే తొలిసారి పిల్లులకు బర్డ్ ఫ్లూ!

కోళ్లకు బర్డ్ ఫ్లూ కలకలం రేపుతున్న వేళ మధ్యప్రదేశ్ చింద్వారా జిల్లాలో దేశంలోనే తొలిసారి ఓ పెంపుడు పిల్లిలో ఈ H5N1 వైరస్ బయటపడింది. దీంతో మనుషులకూ సోకే అవకాశం ఉందనే ఆందోళనలు పెరుగుతున్నాయి. కరోనా మాదిరిగానే ఈ వైరస్ ఆకృతి మార్చుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రాణాంతకం కాదంటున్నారు. కాగా అమెరికా సహా పలు దేశాల్లో జంతువులు, మనుషులకూ ఈ వైరస్ సోకింది.
News February 27, 2025
అప్పుడు స్పందించకుండా ఇప్పుడు రాజకీయామా?: ఉత్తమ్

TG: SLBC ప్రమాదంపై BRS నేతల విమర్శలపై మంత్రి ఉత్తమ్ ఘాటుగా స్పందించారు. ‘శ్రీశైలం పవర్ ప్లాంట్ అగ్ని ప్రమాదంలో ఆరుగురు చనిపోతే, కాళేశ్వరం కూలి ఆరుగురు, పాలమూరు పంప్హౌస్లో ప్రమాదంలో ఆరుగురు చనిపోయినా వెళ్లలేదు. కొండగట్టు బస్సు ప్రమాదంలో 62 మంది చనిపోతే KCR కదల్లేదు. మాజీ సీఎం ఫామ్హౌస్ దగ్గర్లోని మాసాయిపేట రైలు ప్రమాదంలో చిన్నారులు చనిపోతే స్పందించకుండా ఇప్పుడు రాజకీయమా?’ అని ధ్వజమెత్తారు.
News February 27, 2025
ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదు: మాధవ్

APలో YCP నేతలపై పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఫైరయ్యారు. తాను న్యాయ నిపుణుల సలహా తీసుకుని పోలీసుల విచారణకు సహకరిస్తానని చెప్పారు. రాష్ట్రంలో భావ ప్రకటన స్వేచ్ఛ, మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. సూపర్-6 హామీలపై ప్రశ్నించినందుకే తనపై కేసు పెట్టారని మండిపడ్డారు. రాష్ట్రమంతటా భయంకర వాతావరణాన్ని సృష్టిస్తున్న కూటమి ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.