News February 17, 2025

భారత పతాకం ప్రదర్శించని పాక్.. PCB వివరణ

image

ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇస్తున్న పాకిస్థాన్ కరాచీ స్టేడియంలో భారతదేశ <<15488827>>జాతీయ పతాకం<<>> ప్రదర్శించకపోవడంతో దుమారం రేగిన విషయం తెలిసిందే. దీనిపై ఆ దేశ క్రికెట్ బోర్డ్ PCB స్పందించింది. పాక్‌లో భారత్ మ్యాచ్‌లు ఆడట్లేదని, అక్కడి మైదానాల్లో ఆడే జట్ల జెండాలనే ఎగరేసినట్లు వెల్లడించింది. పాక్‌లో ఆడేందుకు BCCI నిరాకరించడంతో హైబ్రిడ్ విధానంలో లీగ్ జరుగుతోంది. భారత్ తన మ్యాచులన్నీ దుబాయ్‌లో ఆడనుంది.

Similar News

News October 29, 2025

ఈ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు

image

TG: ములుగు, భద్రాద్రి, ఖమ్మం జిల్లాల్లో ఇవాళ అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడతాయని HYD IMD వెల్లడించింది. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. పెద్దపల్లి, భూపాలపల్లి, నల్గొండ, సూర్యాపేట, MHBD, WGL, HNK, మంచిర్యాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, జగిత్యాల, కరీంనగర్, సిద్దిపేట, యాదాద్రి, జనగామ, నాగర్ కర్నూల్, ఆసిఫాబాద్ జిల్లాల్లో భారీ వానలు కురుస్తాయని తెలిపింది.

News October 29, 2025

దేశవాళీ వరి.. ఒకసారి నాటితే 3 పంటలు పక్కా

image

ఒకసారి నాటితే 3 సార్లు కోతకు వచ్చే ‘తులసి బాసో’ దేశవాళీ వరి రకాన్ని సాగు చేస్తున్నారు చిత్తూరు(D) పలమనేరుకు చెందిన చందూల్ కుమార్‌రెడ్డి. ఇది సువాసన కలిగిన చాలా చిన్న గింజ వరి. మంచి పోషక, ఔషధ గుణాలు కలిగి తినడానికి మధురంగా ఉంటుంది. తొలి పంట 135 రోజులకు, 2వ పంట 60 నుంచి 70 రోజులకు, 3వ పంట 45 నుంచి 50 రోజులకు కోతకు వస్తుంది. ✍️ ప్రతిరోజూ ఇలాంటి కంటెంట్ కోసం <<-se_10015>>పాడిపంట కేటగిరీ<<>> క్లిక్ చేయండి.

News October 29, 2025

ఇతిహాసాలు క్విజ్ – 50

image

1. తులసి దేవికి పూర్వ జన్మలో ఉన్న పేరు ఏంటి?
2. త్రిపురాంతకుడు అంటే ఏ దేవుడు?
3. కర్ణుడి కవచకుండలాలను దానం చేయమని కోరింది ఎవరు?
4. వాక్కుకు అధిష్టాన దేవత ఎవరు?
5. ఎవరి ఆజ్ఞ మేరకు పరశురాముడు తన తల్లి తల నరికాడు?
☛ సరైన సమాధానాలను సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
<<-se>>#Ithihasaluquiz<<>>