News June 11, 2024
కెనడాపై పాక్ విజయం
T20 వరల్డ్ కప్‌లో కెనడాపై పాకిస్థాన్ చెమటోడ్చి విజయం సాధించింది. 107 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 17.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. రిజ్వాన్ 53*, అయూబ్ 6, బాబర్ ఆజమ్ 33, ఫఖర్ జమాన్ 4 రన్స్ చేశారు. ఈ గెలుపుతో పాక్‌కు సూపర్-8 ఛాన్స్ సజీవంగా ఉంది.
Similar News
News December 23, 2024
ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు.. నోటిఫికేషన్ విడుదల
అగ్నిపథ్ స్కీమ్‌లో భాగంగా ఎయిర్‌ఫోర్స్‌లో నియామకాలకు నోటిఫికేషన్ విడుదలైంది. 50% మార్కులతో మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లిష్ సబ్జెక్టులతో ఇంటర్/తత్సమాన విద్య పూర్తిచేసిన వారు అర్హులు. జనవరి 7 నుంచి FEB 27 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 01-01-2005 నుంచి 01-07-2008 మధ్య జన్మించి ఉండాలి. రాత పరీక్ష, ఫిజికల్, మెడికల్ టెస్టుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
సైట్: <
News December 23, 2024
రేపు, ఎల్లుండి భారీ వర్షాలు
AP: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలహీనపడినప్పటికీ అనూహ్యంగా దిశ మార్చుకుంది. తీవ్ర అల్పపీడనంగా మారి దక్షిణ కోస్తా తీరం దిశగా పయనిస్తోంది. దీని ప్రభావంతో రేపు, ఎల్లుండి ఉత్తరాంధ్ర, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD తెలిపింది. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, ఉ.గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయంది.
News December 23, 2024
పీవీ సింధు పెళ్లి జరిగింది ఇక్కడే
రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లోని ఉదయ్‌సాగర్ సరస్సులో 21 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఒక దీవిలో పీవీ సింధు-వెంకట దత్తసాయి వివాహం జరిగింది. ఆరావళి పర్వతాల మధ్యలోని ఈ దీవిలో వంద గదులతో రఫల్స్ సంస్థ ఈ భారీ రిసార్ట్‌ను నిర్మించింది. అతిథులను పడవల్లో వివాహ వేదిక వద్దకు తీసుకెళ్లారు. వారికోసం 100 గదులను సింధు ఫ్యామిలీ బుక్ చేసినట్లు తెలుస్తోంది. ఈ రిసార్ట్‌లో ఓ గదికి ఒక రోజు అద్దె రూ.లక్ష ఉంటుందని సమాచారం.