News June 13, 2024
పాక్ జిందాబాద్ నినాదాలు.. గ్యాంగ్స్టర్కు దేహశుద్ధి

కర్ణాటకలోని బెళగావి కోర్టు ప్రాంగణంలో జయేశ్ పూజారి అలియాస్ షకీల్ అనే గ్యాంగ్స్టర్ పాక్ జిందాబాద్ నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అక్కడున్న వారు అతనికి దేహశుద్ధి చేశారు. పోలీసులు జయేశ్ను కాపాడి జైలుకు తరలించారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి బెదిరింపు కాల్స్ చేయడం సహా పలు హత్య కేసుల్లో అతను జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఓ కేసు విచారణ కోసం కోర్టుకు తీసుకెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
Similar News
News December 9, 2025
అధికారం కోల్పోయాక విజయ్ దివస్లు.. BRSపై కవిత విమర్శలు

TG: బీఆర్ఎస్పై జాగృతి అధ్యక్షురాలు కవిత మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. ఇవాళ ఆ పార్టీ ‘విజయ్ దివస్’ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆమె సంచలన ట్వీట్ చేశారు. ‘అధికారం కోల్పోయాక దీక్షా దివస్లు.. విజయ్ దివస్లు. ఇది ఉద్యమాల గడ్డ.. ప్రజలు అన్నీ గమనిస్తున్నరు!!’ అని రాసుకొచ్చారు. పార్టీ నుంచి బయటికొచ్చాక బీఆర్ఎస్పై కవిత తరచూ విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.
News December 9, 2025
వీసా రూల్స్ అతిక్రమించిన చైనా సిటిజన్.. అరెస్ట్

2 వారాల నుంచి లద్దాక్, జమ్మూ కశ్మీర్లో తిరుగుతున్న చైనా గ్వాంగ్ డాంగ్ ప్రావిన్స్ షెంజెన్కు చెందిన హు కాంగ్టాయ్ను సెక్యూరిటీ ఏజెన్సీలు అదుపులోకి తీసుకున్నాయి. ఢిల్లీ, UP, రాజస్థాన్లోని బౌద్ధ మత ప్రదేశాల సందర్శనకు NOV 19న టూరిస్ట్ వీసాపై అతడు ఢిల్లీ వచ్చాడు. రూల్స్ అతిక్రమించి లద్దాక్, J&K వెళ్లాడు. ఆర్టికల్ 370, CRPF బలగాల మోహరింపు, సెక్యూరిటీకి సంబంధించిన వివరాలు ఫోన్లో సెర్చ్ చేశాడు.
News December 9, 2025
లైన్ క్లియర్.. ఈ నెల 12న ‘అఖండ-2’ రిలీజ్!

బాలకృష్ణ అఖండ-2 <<18501351>>విడుదలకు మ<<>>ద్రాస్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఈ నెల 12న సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. దీనిపై ఏ క్షణమైనా ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ప్రీమియర్స్, టికెట్ రేట్ల పెంపు కోసం నిర్మాణ సంస్థ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను సంప్రదించినట్లు తెలుస్తోంది. కాగా ఈ నెల 5న రిలీజ్ కావాల్సిన అఖండ-2 వాయిదా పడిన విషయం తెలిసిందే.


