News April 24, 2025
పాక్ నటుడి సినిమాపై నిషేధం

పాకిస్థాన్ నటుడు ఫవాద్ ఖాన్ నటించిన ‘అబిర్ గులాల్’ సినిమాపై భారత సమాచార శాఖ నిషేధం విధించింది. 9 ఏళ్ల తర్వాత ఈ పాక్ నటుడు బాలీవుడ్‌లో రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైన క్రమంలో పహల్‌గామ్ ఉగ్రదాడి కలకలం రేపింది. ఈ నరమేధం వెనుక పాక్ హస్తం ఉందని తేల్చిచెప్పిన భారత్ పాక్ సినిమాలు, నటులపై బ్యాన్ విధించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మే 9న రిలీజ్ కావాల్సి ఉన్న సినిమా ఆగిపోయింది.
Similar News
News April 24, 2025
ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్లు

AP: రాష్ట్రంలోని 4 ట్రిపుల్ ఐటీ క్యాంపస్ (నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం)లలో 2025-26 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు నోటిఫికేషన్ రిలీజైంది. ఏప్రిల్ 27 నుంచి మే 20 వరకు అప్లై చేసుకోవచ్చు. పదో తరగతి మార్కుల ఆధారంగా 6 ఏళ్ల బీటెక్ కోర్సులో నేరుగా ప్రవేశాలు ఉంటాయి. అప్లికేషన్ ఫీజు రూ.300. దరఖాస్తు చేసుకోవాల్సిన సైట్: http://www.rgukt.in/
News April 24, 2025
యుద్ధం వస్తే మన ముందు పాక్ నిలుస్తుందా?

పహల్గామ్ దాడి నేపథ్యంలో భారత్, పాక్ మధ్య యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఒకవేళ యుద్ధం వస్తే మనకు వ్యతిరేకంగా పాక్ నిలువగలదా? మన సైన్యం సంఖ్య 1.44 మిలియన్. 4500 యుద్ధ ట్యాంకులు, 538 యుద్ధ విమానాలు, అధునాతన క్రూయిజ్ క్షిపణులు, భీమ్ ట్యాంకులు, సబ్‌మెరైన్లు ఉన్నాయి. కానీ పాక్ వద్ద ఇవేమీ చెప్పుకోదగ్గ సంఖ్యలో కూడా లేవు. యుద్ధం వస్తే మన ముందు పాకిస్థాన్ ఎంతోకాలం నిలవదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
News April 24, 2025
‘రామాయణ్’లో సీత పాత్ర అందుకే తిరస్కరించా: శ్రీనిధి శెట్టి

నితీశ్ తివారీ తెరకెక్కిస్తోన్న ‘రామాయణ్’ సినిమాలో సీత పాత్రలో నటించమని తనకు ఆఫర్ వచ్చినట్లు హీరోయిన్ శ్రీనిధి శెట్టి తెలిపారు. అయితే ఇందులో యశ్ రావణుడి పాత్రలో నటిస్తున్నాడని తెలిసి ఆ పాత్ర వద్దనుకున్నట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. యశ్‌తో కలిసి ఈ అమ్మడు KGF సిరీస్‌లో నటించిన సంగతి తెలిసిందే. కాగా ‘రామాయణ్’లో రాముడిగా రణ్‌బీర్, సీతగా సాయిపల్లవి కనిపించనున్నారు.