News August 8, 2025
రేప్ కేసులో పాక్ క్రికెటర్ అరెస్టు.. బెయిల్‌పై విడుదల

రేప్ కేసులో పాకిస్థాన్-A క్రికెటర్ హైదర్ అలీని ఇంగ్లండ్ మాంచెస్టర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంగ్లండ్-Aతో వన్డేలు ఆడేందుకు UK వచ్చినప్పుడు అతడు తనపై అత్యాచారం చేశాడని పాకిస్థాన్‌కు చెందిన యువతి ఫిర్యాదు చేసింది. AUG 3న అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు పాస్‌పోర్ట్ స్వాధీనం చేసుకుని అనంతరం బెయిల్‌పై విడుదల చేశారు. అటు విచారణ పూర్తయ్యే వరకు అలీని సస్పెండ్ చేస్తున్నట్లు పాక్ క్రికెట్ బోర్డు తెలిపింది.
Similar News
News August 8, 2025
సిట్ విచారణపై నాకు నమ్మకం లేదు: సంజయ్

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణపై తనకు నమ్మకం లేదని కేంద్రమంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ అన్నారు. దీనిపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ‘ఇదంతా టైమ్ పాస్ వ్యవహారంలా అనిపిస్తోంది. BRS హయాంలోనే నా ఫోన్‌ను ఎక్కువగా ట్యాప్ చేశారు. సిట్ చాలా రోజులుగా విచారణ చేస్తున్నా కేసీఆర్ కుటుంబంలో ఎవరినీ అరెస్టు చేయలేదు’ అని అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు సిట్ విచారణ కోసం బండి సంజయ్ బయల్దేరారు.
News August 8, 2025
రూ.25 లక్షల లంచం తీసుకుంటూ దొరికాడు

AP: 3 వారాల్లో రిటైర్మెంట్. కొడితే జాక్ పాట్ కొట్టాలని, ఇదే లాస్ట్ ఛాన్స్ అనుకున్నాడేమో. ఓ సంస్థకు రూ.35 కోట్ల బిల్లుల మంజూరు కోసం గిరిజన సంక్షేమ శాఖ ENC సబ్బవరపు శ్రీనివాస్ రూ.5 కోట్ల లంచం డిమాండ్ చేశాడు. ఆ సంస్థ ఫిర్యాదుతో ట్రాప్ చేసిన ACB రూ.25లక్షల టోకెన్ అమౌంట్ తీసుకుంటుండగా విజయవాడలో పట్టుకుంది. గతంలోనూ 2 సార్లు పట్టుబడినా ఆయనలో మార్పురాలేదు. ACB చరిత్రలో అతిపెద్ద ట్రాప్‌గా తెలుస్తోంది.
News August 8, 2025
AP న్యూస్ రౌండప్

* విశాఖ గ్యాస్ సిలిండర్ ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల నష్ట పరిహారం
* నెల్లూరు జిల్లా చెర్లోపల్లి గేటు సమీపంలో గంగా-కావేరీ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు
* తిరుపతిలో ముంతాజ్ హోటల్‌కు భూకేటాయింపులు రద్దు
* జిల్లా కేంద్రాల్లో టెక్నాలజీ సర్వీసెస్ కేంద్రాలు: మన్నవ మోహన్ కృష్ణ
* నేటి నుంచి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (APL) ప్రారంభం