News October 7, 2024
భారత యువతిని పెళ్లాడనున్న పాక్ క్రికెటర్

పాకిస్థాన్ క్రికెటర్ హసన్ రజా భారత యువతి పూజను వివాహం చేసుకోనున్నారు. ఇటీవల న్యూయార్క్‌లో వీరి నిశ్చితార్థం జరగ్గా, ఇందుకు సంబంధించిన ఫొటోలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పెళ్లికి ముందు పూజ ఇస్లాం మతాన్ని స్వీకరించనున్నట్లు రజా తెలిపారు. కాగా 32 ఏళ్ల హసన్ రజా పాక్ తరఫున ఒక వన్డే, 10 టీ20లు ఆడారు. అనంతరం ఆయన యూఎస్‌లో స్థిరపడ్డారు. పూజ ఫ్యామిలీ కూడా అక్కడే స్థిరపడింది.
Similar News
News January 31, 2026
భారత్‌పై సుంకాలు.. ట్రంప్ మూర్ఖత్వానికి నిదర్శనం:US రిటైర్డ్ కల్నల్

IND-US మధ్య వాణిజ్య చర్చలపై అమెరికా రిటైర్డ్ కల్నల్ డగ్లస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రేడ్ డీల్ విషయంలో అమెరికా చెప్పిన ప్రతి అంశానికీ ఇండియా ఓకే చెప్పదన్నారు. సొంత ప్రయోజనాలకు రాజీపడి ఏ దేశమూ ఇతర దేశాలకు తలొగ్గదని పేర్కొన్నారు. రష్యాతో బిజినెస్ చేస్తున్న దేశాలపై అధిక సుంకాలను విధించడం ట్రంప్ మూర్ఖపు మనస్తత్వానికి నిదర్శనమని అభివర్ణించారు. ఇలాంటి పనుల వల్ల USకే నష్టం వాటిల్లే అవకాశం ఉందన్నారు.
News January 31, 2026
సంజూ.. సొంత గడ్డపైనా ఫెయిల్

భారత బ్యాటర్ సంజూ శాంసన్ మరోసారి విఫలం అయ్యారు. సొంతగడ్డ తిరువనంతపురంలోనూ రన్స్ చేయలేకపోయారు. NZతో చివరి టీ20లో 6 బంతుల్లో 6 పరుగులు చేసి ఔటయ్యారు. దీంతో స్టేడియంలోని ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ సిరీస్‌లో సంజూ 10, 6, 0, 24, 6 స్కోర్లతో కేవలం 46 రన్స్ మాత్రమే చేశారు. మరి ఫిబ్రవరి 7 నుంచి జరిగే టీ20 ప్రపంచకప్ తుది జట్టులో సంజూకు ఛాన్స్ ఇస్తారో లేదో చూడాలి.
News January 31, 2026
యాడ్స్‌లో ‘కింగ్’ నంబర్-1.. రెండో స్థానంలో మిస్టర్ కూల్

ఇండియన్ అడ్వర్టైజింగ్ స్క్రీన్ టైమ్‌లో 8% వాటాతో కింగ్ ఖాన్ షారుఖ్ నంబర్-1 స్థానంలో నిలిచినట్లు మార్కెటింగ్ మైండ్ సంస్థ వెల్లడించింది. అన్ని ఛానళ్లలో కలిపి రోజుకు సగటున 27 గంటలపాటు ఆయన యాడ్స్ ప్రసారమవుతున్నాయని తెలిపింది. రెండో స్థానంలో ధోనీ(రోజుకు 22Hr యాడ్స్) ఉన్నారని పేర్కొంది. ఆ తర్వాత వరుసగా అక్షయ్, రణ్వీర్ సింగ్, అమితాబ్, అనన్య, రణ్‌బీర్ కపూర్, అనుష్కా శర్మ, ద్రవిడ్, కోహ్లీ ఉన్నారంది.


