News July 20, 2024
ధోనీతో రిజ్వాన్‌ను పోల్చిన పాక్ జర్నలిస్ట్.. హర్భజన్ ఫైర్!

ధోనీ, రిజ్వాన్‌లలో ఎవరు బెటర్ అంటూ Xలో పోస్ట్ పెట్టిన ఓ పాక్ జర్నలిస్ట్‌పై మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ మండిపడ్డారు. ‘ఇది చాలా సిల్లీ క్వశ్చన్. రిజ్వాన్ కంటే ధోనీ చాలా బెటర్. రిజ్వాన్‌ను అడిగినా ఇదే చెబుతారు. ఇప్పటికీ వరల్డ్ క్రికెట్లో ధోనీయే నంబర్ 1. అతని కంటే బెటర్ WK ఎవరూ ఉండరు. రిజ్వాన్ కూడా మంచి ప్లేయర్. కానీ ఇలా పోల్చడం తప్పు’ అని ట్వీట్ చేశారు.
Similar News
News January 27, 2026
18 ఏళ్ల చర్చల తర్వాత ఇండియా-EU ట్రేడ్ డీల్ ఖరారు

దాదాపు 18 ఏళ్ల సుదీర్ఘ చర్చల తర్వాత భారత్, యూరోపియన్ యూనియన్ (EU) మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఖరారైంది. ఈ చారిత్రక ‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స్’ను మంగళవారం అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ ఒప్పందంతో ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు భారీగా పెరగనున్నాయి. రాబోయే 6 నెలల్లోపు అధికారిక సంతకాలు పూర్తయ్యి 2027 ప్రారంభం నాటికి ఈ ఒప్పందం అమల్లోకి రానుంది.
News January 27, 2026
నిద్ర నాణ్యత పెంచుకోండిలా!

పగలంతా హుషారుగా పనిచేయాలంటే రాత్రి నాణ్యమైన నిద్ర అవసరం. అందుకు రోజూ ఒకే టైమ్‌కు నిద్ర పోవడం, లేవడం చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. సెలవు రోజుల్లోనూ దీన్ని పాటించాలంటున్నారు. పడుకునే చోట లైట్లు పడకుండా, శబ్దాలు రాకుండా చూసుకోవాలని చెబుతున్నారు. రాత్రి వేళ లైట్ ఫుడ్ తీసుకోవడంతో పాటు నిద్రకు 30-60ని. ముందు స్క్రీన్ చూడటం ఆపాలని సూచిస్తున్నారు. ఒత్తిడికి గురయ్యే విషయాల గురించి ఆలోచించొద్దంటున్నారు.
News January 27, 2026
పహల్గాం హీరో అదిల్‌కు అవార్డు

గత ఏప్రిల్‌లో ఉగ్రమూకలు పహల్గాంలో జరిపిన దాడిలో ధైర్యంగా పోరాడి ప్రాణాలర్పించిన అదిల్ హుస్సేన్ షాకు JK ప్రభుత్వం అవార్డు ప్రకటించింది. విచక్షణారహితంగా దాడి చేస్తున్న ఉగ్రవాదుల నుంచి తుపాకీ లాక్కునేందుకు అదిల్ యత్నించారు. హార్స్ రైడర్ అయిన ఆయన ప్రాణాలను పణంగా పెట్టి టూరిస్టులను కాపాడే ప్రయత్నం చేశారు. ఆయన ధైర్యసాహసాలను గుర్తించిన ప్రభుత్వం ₹లక్ష నగదుతో పాటు అవార్డును వారి ఫ్యామిలీకి అందజేసింది.


