News February 22, 2025
రోహిత్‌పై పాక్ దిగ్గజం పొగడ్తలు

భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ ప్రశంసల వర్షం కురిపించారు. హిట్ మ్యాన్ లేజీగా ఉన్నా చాలా ప్రత్యేకమని కొనియాడారు. వన్డేల్లో 3 డబుల్ సెంచరీలు చేశారని తెలిపారు. 2008లో ఓ ట్రై సిరీస్ ఆడుతున్న సమయంలో అతనిలో సత్తా ఉందని గమనించినట్లు పేర్కొన్నారు. రోహిత్ 10 ఓవర్ల పాటు క్రీజులో ఉంటే తర్వాత వచ్చే బ్యాటర్లకు ఆట ఈజీగా ఉంటుందన్నారు.
Similar News
News February 22, 2025
SRHపై ఏపీ క్రికెట్ ఫ్యాన్స్ ఫైర్?

IPL టీమ్ SRHపై ఏపీ యువత మండిపడుతోంది. పేరుకే తెలుగు టీమ్ అని, ఒక్క మ్యాచ్ కూడా తమ రాష్ట్రంలో నిర్వహించడం లేదని వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. HYDలోనే మ్యాచులన్నీ నిర్వహిస్తే AP క్రికెట్ ప్రేమికులు ప్రత్యక్షంగా ఎలా చూడాలని ప్రశ్నిస్తున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ ఓనర్ తెలుగోడు కాబట్టి విశాఖలో 2 మ్యాచులు ఆడిస్తున్నారని చెబుతున్నారు. దీనిపై SRH ఓనర్ కావ్యా మారన్ ఆలోచించాలని కామెంట్లు చేస్తున్నారు.
News February 22, 2025
BIG BREAKING: రేపటి గ్రూప్-2 పరీక్షలు యథాతథం

AP: గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలపై ఉత్కంఠ వీడింది. షెడ్యూల్ ప్రకారమే రేపు ఎగ్జామ్ యథాతథంగా ఉంటుందని APPSC అధికారికంగా ప్రకటించింది. పరీక్షలు వాయిదా వేయలేమని స్పష్టం చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నందున గ్రాడ్యుయేట్లకు ప్రయోజనం కల్పించే నిర్ణయం తీసుకోలేమని తేల్చి చెప్పింది. ఈ మేరకు ప్రభుత్వం రాసిన లేఖకు ఏపీపీఎస్సీ సమాధానం ఇచ్చింది.
News February 22, 2025
రేపు భారత్ ఓడిపోతుంది: IIT బాబా

మహాకుంభమేళాలో ఐఐటీ బాబాగా వైరల్ అయిన అభయ్ సింగ్ రేపు పాకిస్థాన్‌తో మ్యాచులో భారత్ ఓడిపోతుందని అంచనా వేశారు. ‘నేను ఇప్పుడే చెబుతున్నానుగా ఇండియా అస్సలు గెలవదు’ అని ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. ‘విరాట్.. ఇంకా చాలా మంది ఉన్నప్పటికీ ఎలా గెలుస్తారో చూద్దాం. అది జరిగి తీరదు’ అని స్పష్టం చేశారు. బాబా కామెంట్లపై టీమ్ ఇండియా ఫ్యాన్స్ మండిపడుతున్నారు.