News April 15, 2025

దుబాయ్‌లో ఇద్దరు తెలుగోళ్లను నరికి చంపిన పాకిస్థానీ

image

TG: దుబాయ్‌లో రాష్ట్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులను ఓ పాకిస్థానీ నరికి చంపాడు. నిర్మల్(D) సోన్‌కు చెందిన అష్టపు ప్రేమ్‌సాగర్ (40), NZB(D)కు చెందిన శ్రీనివాస్ దుబాయ్‌లోని ఓ ఫేమస్ బేకరీలో పనిచేస్తున్నారు. అదే బేకరీలో పనిచేసే ఓ పాకిస్థానీ మత విద్వేషంతో వీరిద్దరిని దారుణంగా నరికి చంపాడు. ఈ దాడిలో మరో ఇద్దరు తెలుగువారు గాయపడినట్లు తెలుస్తోంది. గత శుక్రవారం ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Similar News

News February 2, 2026

జనవరిలో రికార్డు స్థాయి UPI లావాదేవీలు

image

జనవరి నెలలో దేశంలో UPI లావాదేవీలు రూ.28.33 లక్షల కోట్లకు చేరుకొని రికార్డు సృష్టించినట్లు నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(NPCI) వెల్లడించింది. సంఖ్యాపరంగా చూస్తే 21.70 బిలియన్లుగా నమోదయ్యాయని తెలిపింది. డిసెంబర్‌ నెలలో నమోదైన రూ.27.97 లక్షల కోట్ల కంటే ఇది ఎక్కువ.

News February 2, 2026

కాళ్లు తెల్లగా అవ్వాలంటే..

image

చాలామంది ఇతర శరీర భాగాలపై పెట్టిన శ్రద్ధ పాదాలపై పెట్టరు. దీంతో ఇవి దీర్ఘకాలంలో నల్లగా మారిపోతాయి. ఇలాకాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలంటున్నారు చర్మ నిపుణులు. కాళ్లను తడిలేకుండా తుడుచుకుని మాయిశ్చరైజర్‌ రాయాలి. బయటికి వెళ్లేటపుడు సన్‌స్క్రీన్‌ రాయాలి. లాక్టిక్‌ యాసిడ్‌, గ్లైకాలిక్‌ యాసిడ్‌, విటమిన్‌ సి, హైడ్రోక్వినోన్‌లలో ఏదో ఒకటి ఉన్న లైటెనింగ్‌ క్రీములు వాడాలని సూచిస్తున్నారు.

News February 2, 2026

పాక్ ఉక్కిరిబిక్కిరి.. మహిళలే సూసైడ్ బాంబర్లుగా మారారు!

image

పాకిస్థాన్ అధీనంలోని బలూచిస్థాన్‌లో ఉద్రిక్తతలు చల్లారట్లేదు. పాక్ సైన్యంపై రెబల్స్ విరుచుకుపడుతున్నారు. మహిళలు సూసైడ్ బాంబర్లుగా మారి పాక్ సైన్యాన్ని దెబ్బతీస్తున్నారు. ఆసిఫా మెంగల్ (24) అనే సూసైడ్ బాంబర్, మరో మహిళా ఫైటర్ చేసిన దాడుల్లో 50 మంది చనిపోగా అందులో 17 మందికిపైగా పాక్ జవాన్లు ఉన్నారు. 200 మంది పాక్ జవాన్లను చంపామని, 17 మందిని బంధించామని బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది.