News September 17, 2024

చైనాకు మద్దతు తెలిపిన పాక్ ఆటగాళ్లు

image

ఏషియన్ హాకీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్‌లో చైనాకు పాక్ ఆటగాళ్లు మ‌ద్ద‌తు తెలిపారు. పాక్‌ ఎవ‌రి చేతిలో సెమీస్‌లో ఓట‌మిపాలైందో వారికే సపోర్ట్ చేయడం గ‌మ‌నార్హం. మ్యాచ్ సంద‌ర్భంగా పాక్ ఆట‌గాళ్లు చైనా జెండాల‌ను చేత‌బ‌ట్టుకొని క‌నిపించారు. ఈ మ్యాచ్‌లో పాక్ ఎవరికి మద్దతు ఇస్తున్నది స్ప‌ష్ట‌ం అవుతోందంటూ కామెంటేట‌ర్ వ్యాఖ్యానించారు. ఆ దృశ్యాలు వైర‌ల్ అవుతున్నాయి.

Similar News

News January 11, 2026

మరణించిన వారిని దూషిస్తే..?

image

మరణించిన వ్యక్తిని నిందించినా, దూషించినా, అవమానించినా శాస్త్రాల ప్రకారం నేరం. మనుస్మృతి, భారతంలోని శాంతి పర్వం ప్రకారం.. వారు తిరిగి సమాధానం చెప్పలేరు కాబట్టి వారి గురించి చెడుగా మాట్లాడటం పిరికిపంద చర్యగా పేర్కొంటారు. ఇలా చేస్తే మనలోని సానుకూల శక్తి నశించి, ప్రతికూలత పెరుగుతుంది. మరణించిన వారు చేసిన తప్పుల కంటే వారిలోని మంచిని మాత్రమే గుర్తుంచుకోవాలి. లౌకిక బంధాలు ముగిసిన వారు దైవంతో సమానం.

News January 11, 2026

714 పోస్టులు.. అప్లై చేశారా?

image

ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డ్ (DSSSB) 714 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. టెన్త్ అర్హతగల అభ్యర్థులు జనవరి 15వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 27ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు జీతం రూ.18,000-రూ.56,900 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://dsssbonline.nic.in.

News January 11, 2026

చెరకు సాగుకు ఎలాంటి విత్తనం ఎంపిక చేయాలి?

image

చెరకు సాగులో రైతులు స్వల్పకాలిక రకాలను 40 శాతం, మధ్య, దీర్ఘకాలిక రకాలను 60 శాతం నాటుకుంటే పంట ఒకేసారి పక్వతకు రాకుండా దఫదఫాలుగా కోతకు వచ్చే వీలుంటుంది. రైతులు నాణ్యమైన, అధిక దిగుబడినిచ్చే, పూత పూయని రకాలు లేదా 7-8 నెలల వయస్సు గల లేత తోటల నుంచి విత్తనాన్ని సేకరించాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. నీటి ఎద్దడికి గురయ్యే ప్రాంతంలో ఈ సమస్యను తట్టుకునే రకాలను మాత్రమే ఎంపిక చేసుకోవాలి.