News June 10, 2024
పాక్ ఓటమి.. ఆ దేశ ప్రధానిపై ట్రోల్స్
నిన్న తొలి ఇన్నింగ్స్‌లో INDను 119 రన్స్‌కే PAK కట్టడి చేయడంతో ఆ దేశ PM షెహబాజ్ షరీఫ్ ట్వీట్ చేశారు. ‘పాక్ టీమ్ గ్రేట్ బౌలింగ్. టోర్నీలో ఇది గొప్ప మ్యాచ్ అవుతుందని ఆశిస్తున్నా. ఛేజింగ్‌కు దిగే అబ్బాయిలకు ఆల్ ది బెస్ట్’ అని రాసుకొచ్చారు. అయితే పాక్ మ్యాచ్ ఓడిపోవడంతో ఆయన మళ్లీ ఎలాంటి ట్వీట్ చేయలేదు. దీంతో ‘గుర్తుపెట్టుకోండి.. ఎప్పుడూ ముందే సంబరాలు చేసుకోవద్దు’ అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
Similar News
News December 22, 2024
మనవడి రికార్డు.. చంద్రబాబు ప్రశంసలు
నారా వారసుడు దేవాన్ష్ <<14952633>>ప్రపంచ రికార్డు<<>> సృష్టించడంతో తాత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు Xలో సంతోషం వ్యక్తం చేశారు. కృషి, పట్టుదల, అంకితభావం విజయానికి కీలకమని, ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు కొన్ని నెలలుగా దేవాన్ష్ పడిన కష్టాన్ని చూసి గర్విస్తున్నట్లు పేర్కొన్నారు. దేవాన్ష్ నిబద్ధత కళ్లారా చూశామని, ఈ ఘనత అందుకోవడం గర్వంగా ఉందని తల్లిదండ్రులు లోకేశ్, బ్రహ్మణి ట్వీట్ చేశారు.
News December 22, 2024
క్రిస్మస్ సెలవులు ఎన్ని రోజులంటే?
తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ సెలవులపై కొందరు అయోమయానికి గురవుతున్నారు. తెలంగాణలో ప్రభుత్వ క్యాలెండర్ ప్రకారం ఈ నెల 25, 26న పబ్లిక్ హాలిడేస్ ఉన్నాయి. ఆ రెండు రోజులు స్కూళ్లు, ప్రభుత్వ ఆఫీసులకు సెలవులు ఉంటాయి. 24న ఆప్షనల్ హాలిడే ఉండటంతో కొన్ని స్కూళ్లు ఆ రోజూ సెలవు ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు ఏపీలో 25న మాత్రమే పబ్లిక్ హాలిడే ఉండగా, 24, 26 తేదీల్లో ఆప్షనల్ హాలిడేస్ ఇచ్చారు.
News December 22, 2024
రాహుల్ గాంధీ ఫ్యామిలీ లంచ్
కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో విపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తన కుటుంబంతో సరదాగా గడిపారు. తల్లి సోనియా గాంధీ, సోదరి ప్రియాంకలతో కలిసి లంచ్ చేశారు. అందులో ప్రియాంక భర్త రాబర్ట్ వాద్రా, కూతురు మిరయా కూడా ఉన్నారు. ఈ ఫొటోలను రాహుల్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.