News October 14, 2024

పాక్ ఘోర ఓటమి.. భారత్‌కు బిగ్ షాక్

image

మహిళల టీ20 వరల్డ్ కప్‌లో భారత జట్టు పోరాటం ముగిసింది. న్యూజిలాండ్ చేతిలో 54 రన్స్ తేడాతో పాకిస్థాన్ ఘోరంగా ఓడింది. దీంతో భారత్, పాక్ టోర్నీ సెమీస్ ఆశలు గల్లంతయ్యాయి. 111 రన్స్ టార్గెట్‌తో ఛేజింగ్‌కు దిగిన పాక్ 11.4 ఓవర్లలో 56 రన్స్ మాత్రమే చేసి ఆలౌట్ అయ్యింది. కాగా గ్రూప్-ఏ నుంచి ఇప్పటికే ఆస్ట్రేలియా సెమీస్‌లో పాగా వేయగా తాజాగా న్యూజిలాండ్ బెర్తు ఖరారు చేసుకుంది.

Similar News

News October 21, 2025

Asia cup ట్రోఫీ వివాదం.. ఏసీసీ కొత్త ప్రతిపాదన!

image

Asia cup ట్రోఫీని తమకు అందజేయాలని ACC చీఫ్ నఖ్వీకి <<18064371>>బీసీసీఐ మెయిల్<<>> పంపిన విషయం తెలిసిందే. దీంతో నవంబర్ తొలివారంలో ట్రోఫీ ప్రజెంటేషన్ కార్యక్రమం దుబాయ్‌లో నిర్వహిస్తామని ACC ప్రతిపాదన చేసింది. ‘మీరు ట్రోఫీని కోరుకుంటే.. దాన్ని ఇచ్చేందుకు వేదిక ఏర్పాటు చేస్తాం’ అని చెప్పినట్లు సమాచారం. కానీ అందుకు BCCI సుముఖంగా లేదని, ICC మీటింగ్‌లో దీనిపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందని ACC వర్గాలు చెప్పాయి.

News October 21, 2025

దీపిక-రణ్‌వీర్ కూతురిని చూశారా?

image

బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొణె తమ కూతురు దువా ఫొటోను తొలిసారి షేర్ చేశారు. దీపావళి సందర్భంగా తీసుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫొటో చూసిన అభిమానులు వారి కూతురు చాలా క్యూట్‌గా ఉందని కామెంట్స్ చేస్తున్నారు. దీపిక, రణ్‌వీర్ జంటకు 2018లో వివాహం జరగగా గతేడాది సెప్టెంబర్‌లో పాప జన్మించింది.

News October 21, 2025

సర్ఫరాజ్ ఖాన్‌‌కు నిరాశ.. నెటిజన్ల ఫైర్!

image

SA-Aతో 4-డే మ్యాచులకు BCCI ప్రకటించిన IND-A <<18062911>>జట్టులో<<>> సర్ఫరాజ్ ఖాన్‌కు చోటు దక్కలేదు. దీంతో సెలక్టర్లపై నెటిజన్లు ఫైరవుతున్నారు. సర్ఫరాజ్‌కు ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 65+ AVg ఉందని, ఇటీవల ENG-Aపై ఓ మ్యాచులో 92, రంజీ మ్యాచులో 74 రన్స్ చేశారని, 17kgs బరువు తగ్గడంతో పాటు Yo-Yo టెస్ట్ పాసయ్యారని గుర్తుచేస్తున్నారు. దేశవాళీలో బాగా రాణిస్తున్నా జాతీయ జట్టుకు సెలక్ట్ చేయకపోవడం కరెక్ట్ కాదని అంటున్నారు.