News March 21, 2025

కివీస్‌పై పాకిస్థాన్ స్టన్నింగ్ విన్

image

న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో పాకిస్థాన్ అద్భుత విజయం సాధించింది. 205 పరుగుల టార్గెట్‌ను ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 16 ఓవర్లలోనే ఛేదించింది. అంతర్జాతీయ క్రికెట్‌లో 200కుపైగా టార్గెట్‌ను అత్యంత వేగంగా ఛేదించడం ఇదే తొలిసారి. ఆ జట్టు ఓపెనర్ హసన్ నవాజ్ (105*) సెంచరీతో విధ్వంసం సృష్టించారు. 45 బంతుల్లోనే 10 ఫోర్లు, 7 సిక్సర్లతో శతకం బాదారు. కెప్టెన్ సల్మాన్ అఘా (51*) హాఫ్ సెంచరీతో రాణించారు.

Similar News

News March 28, 2025

ప్రభుత్వం సంచలన నిర్ణయం

image

TG: పదవీ విరమణ చేసి కాంట్రాక్ట్‌పై పనిచేస్తున్న 6,729 మంది ఉద్యోగులను తొలగిస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో మెట్రోరైలు MD ఎన్వీఎస్ రెడ్డి, వైటీడీఏ వైస్ ఛైర్మన్ కిషన్ రావు లాంటి వారు కూడా ఉండటం గమనార్హం. ఎవరి సేవలైనా కావాలనుకుంటే మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చి తీసుకోవాలని ఆయా శాఖలను ప్రభుత్వం ఆదేశించింది. ఈ నిర్ణయం వల్ల కొత్తగా 6వేలకు పైగా ఉద్యోగ నియామకాలకు అవకాశం లభించనుంది.

News March 28, 2025

ఆసుపత్రిలో చేరిన కింగ్ ఛార్లెస్-3

image

బ్రిటన్ కింగ్ ఛార్లెస్-3 ఆసుపత్రిలో చేరారు. 76ఏళ్ల ఆయన కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. అందుకు చికిత్స తీసుకుంటుండగా వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్‌తో హాస్పిటల్‌లో చేర్పించారు. ప్రస్తుతం కింగ్ ఆరోగ్యం నిలకడగా ఉందని లండన్‌లోని బకింగ్‌హమ్ ప్యాలెస్ ప్రకటన విడుదల చేసింది. 2022లో తన తల్లి క్వీన్ ఎలిజబెత్-2 మరణం తర్వాత బ్రిటన్ కింగ్‌గా అవతరించిన ఛార్లెస్‌కు 2024 ఫిబ్రవరిలో క్యాన్సర్ నిర్ధారణ అయింది.

News March 28, 2025

సెలవు రోజుల్లోనూ పని చేయనున్న కార్యాలయాలు

image

దేశవ్యాప్తంగా ఈనెల 29, 30, 31 తేదీల్లో ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ ఆఫీసులు పనిచేయనున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఈనెల 31తో ముగియనుండగా, ఆలోగా పన్ను చెల్లింపుదారులు పెండింగ్‌లో ఉన్న తమ ట్యాక్స్ ట్రాన్సాక్షన్స్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో సెలవులున్నప్పటికీ కార్యాలయాలు పని చేస్తాయని CBDT తెలిపింది. అటు ఏపీలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాలూ 30, 31 తేదీల్లో పనిచేయనున్నాయి.

error: Content is protected !!