News October 14, 2024

పాకిస్థాన్ లక్ష్యం 111 రన్స్.. భారత్ సెమీస్ వెళ్లాలంటే ఇలా జరగాలి..

image

భారత్ ఆశలు పెట్టుకున్న పాకిస్థాన్, న్యూజిలాండ్ మ్యాచ్‌ ఉత్కంఠగా సాగుతోంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కివీస్ 20ఓవర్లలో 110/6 స్కోర్ చేసింది. మహిళల T20 వరల్డ్ కప్‌లో భారత్ సెమీస్ వెళ్లాలంటే 10.4 ఓవర్ల తర్వాతే లక్ష్యాన్ని చేరుకోవాలి. ఒకవేళ 10.4 ఓవర్ల లోపు టార్గెట్ ఛేదిస్తే పాకిస్థాన్ క్వాలిఫై అవుతుంది. పాక్ ఓడితే పాకిస్థాన్, ఇండియా రెండూ ఇంటి ముఖం పడతాయి. కీలకమ్యాచ్‌లో పాక్ 8క్యాచ్‌లు వదిలేయడం గమనార్హం.

Similar News

News February 6, 2026

BREAKING: భారీగా తగ్గిన వెండి ధర

image

వెండి ధరల పతనం కొనసాగుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ కేజీ వెండి ధర రూ.20 వేలు తగ్గింది. దీంతో కేజీ సిల్వర్ రేటు ప్రస్తుతం రూ.2,80,000 పలుకుతోంది. కాగా 2 రోజుల్లోనే వెండి ధర రూ.40 వేలు తగ్గింది.

News February 6, 2026

శ్రీవారి నేత్ర దర్శనం ఏరోజు ఉంటుందంటే?

image

శ్రీ వేంకటేశ్వర స్వామి నేత్రాలు అత్యంత శక్తివంతమైనవి. అలాగే ప్రకాశవంతమైనవి కూడా! ఆ విశ్వశక్తిని సామాన్య మానవులు నేరుగా చూడలేరు. అందుకే స్వామివారి కళ్లను ఎప్పుడూ పచ్చకర్పూరంతో కప్పి ఉంచుతారు. కేవలం గురువారం నాడు మాత్రమే ఆయన కళ్లను చూడవచ్చు. ఆనంద నిలయంలో ప్రతి గురువారం ‘నిజరూప దర్శనం’ సమయంలో మాత్రమే ఆ కర్పూర నామాన్ని తగ్గించి స్వామివారి నేత్రాలను చూసే అవకాశం కల్పిస్తారు.

News February 6, 2026

తొందరపడుతున్న బంగ్లాదేశ్.. వెల్లువెత్తుతున్న విమర్శలు

image

భారత్-US ట్రేడ్‌ డీల్‌ తర్వాత బంగ్లాదేశ్‌ కూడా అగ్రరాజ్యంతో ‘సీక్రెట్’ ఒప్పందం కోసం తొందరపడుతోంది. ఈ నెల 12న ఆ దేశంలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో 9వ తేదీన హడావుడిగా ఒప్పందంపై సైన్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా ట్రేడ్ డీల్ అంటే పలుమార్లు చర్చిస్తారు. అందులోని విషయాలను ప్రజలు, పారిశ్రామికవేత్తలతో పంచుకుంటారు. ఇవేవీ లేకుండా రహస్యంగా డీల్‌కు రెడీ అవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.