News September 13, 2025

పసికూనపైనా పాక్ చెత్త ప్రదర్శన!

image

ఆసియా కప్ 2025లో ఒమన్‌‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు అంతంత మాత్రం ప్రదర్శన చేసి అబాసు పాలవుతోంది. నిర్ణీత 20 ఓవర్లలో పాక్ 7 వికెట్ల నష్టానికి 160 పరుగులే చేసింది. మహ్మద్ హ్యారిస్(66), ఫర్హాన్(29), ఫకర్ జమాన్(23) మినహా ఎవరూ పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. కెప్టెన్ సల్మాన్ అఘా, ఓపెనర్ అయూబ్ గోల్డెన్ డక్ కావడం గమనార్హం. ఒమన్ బౌలర్లలో ఫైజల్, ఖలీమ్‌లకు చెరో 3 వికెట్లు, మహ్మద్ నదీమ్ ఒక వికెట్ తీశారు.

Similar News

News February 6, 2026

బర్డ్ ఫ్లూతో కాకులు మృతి.. చెన్నైలో అలర్ట్

image

తమిళనాడులో బర్డ్ ఫ్లూ కేసులు కలవరపెడుతున్నాయి. చెన్నైలోని అడయార్, అవడి, ఈసీఆర్‌లో జనవరి నుంచే 1000కిపైగా కాకులు చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా కాకుల మరణంపై బోపాల్‌లోని లాబోరేటరీలో చేసిన పరీక్షల్లో H5N1 వైరస్ కారణమని తేలింది. దీంతో పక్షులు చనిపోయి కనిపిస్తే తాకకూడదని, పిల్లలను దూరంగా ఉంచాలని ప్రజలకు అధికారులు సూచించారు. పక్షులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో మాస్కులు ధరించాలన్నారు.

News February 6, 2026

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News February 6, 2026

శుభ సమయం (06-2-2026) శుక్రవారం

image

➤ తిథి: బహుళ పంచమి రా.2.37 వరకు ➤ నక్షత్రం: హస్త రా.1.56 వరకు ➤ శుభ సమయాలు: ఉ.6.32-8.47, ఉ.11.14-ఉ.11.15, మ.1.20-మ.3.58 ➤ రాహుకాలం: ఉ.10.30-మ.12.00 ➤ యమగండం: మ.3.00-మ.4.30 ➤ దుర్ముహూర్తం: ఉ.08.48-ఉ.09.33, మ.12.34-మ.1.19 ➤ వర్జ్యం: ఉ.9.32-ఉ.11.13 ➤ అమృత ఘడియలు: రా.7.38-రా.9.18 వరకు