News November 23, 2024

ప్రియాంక ఫొటోకు పాలాభిషేకం

image

TG: వయనాడ్ (కేరళ) ఉపఎన్నికలో ప్రియాంకా గాంధీ భారీ మెజారిటీతో గెలవడంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు సంబరాలు చేసుకున్నారు. మాజీ ఎంపీ వి.హనుమంతరావు, ఇతర నాయకులు గాంధీభవన్‌లో ఆమె చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ప్రియాంక యావత్ భారత దేశంలో తిరిగితే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని వీహెచ్ తెలిపారు. మహారాష్ట్రలో బీజేపీ డబ్బుల ప్రభావంతో గెలిచిందని, అది అంబానీ-అదానీల గెలుపని ఆరోపించారు.

Similar News

News November 14, 2025

18 నెలల్లో రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు: CBN

image

AP: కూటమి అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించినట్లు CII సదస్సులో సీఎం చంద్రబాబు ప్రకటించారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ ఇన్వెస్ట్‌మెంట్స్ రాబట్టగలిగామని వివరించారు. అటు రాష్ట్రంలో చేపట్టే వివిధ ప్రాజెక్టులకు సంబంధించి లులూ గ్రూప్‌తో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. సీఎం CBN, లులూ ఛైర్మన్ యూసుఫ్ అలీ సమక్షంలో అధికారులు, సంస్థ ప్రతినిధులు అంగీకార పత్రాలు మార్చుకున్నారు.

News November 14, 2025

కలలు కంటూ ఉండండి.. బీజేపీకి టీఎంసీ కౌంటర్

image

బిహార్ ఎన్నికల్లో NDA విజయం నేపథ్యంలో BJP, తృణమూల్ కాంగ్రెస్ మధ్య SMలో మాటల యుద్ధం నడుస్తోంది. బిహార్ తర్వాత బెంగాల్ వంతు అని BJP చేసిన ట్వీట్‌కు TMC కౌంటర్ ఇచ్చింది. BJP కలలు కంటూనే ఉండాలనే అర్థం వచ్చేలా మీమ్ పోస్ట్ చేసింది. నీటి అడుగున కుర్చీలో అస్థిపంజరమున్న ఫొటో షేర్ చేస్తూ ‘బెంగాల్‌లో గెలుపు కోసం BJP ఇంకా ఎదురుచూస్తోంది’ అని ఎద్దేవా చేసింది. 2026లో బెంగాల్‌‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

News November 14, 2025

రాహుల్, కేటీఆర్‌ ఐరన్ లెగ్స్: బండి

image

TG: బిహార్ ఎన్నికల తరువాత కాంగ్రెస్ పని ఖతమైందని, రాహుల్ గాంధీ ఇక పబ్జీ గేమ్‌కే పరిమితమవుతారని మంత్రి బండి సంజయ్ విమర్శించారు. KTR వర్కింగ్ ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి BRS పతనం కొనసాగుతూనే ఉందన్నారు. దేశంలో రాహుల్, TGలో కేటీఆర్ ఐరన్ లెగ్స్ అని బండి ఎద్దేవా చేశారు. దేశం మొత్తం పోటీ చేస్తామని TRSను BRSగా మార్చిన కేసీఆర్ పత్తా లేకుండా పోయారని, చివరకు ఆ పార్టీ ఉప ప్రాంతీయ పార్టీగా మారిందన్నారు.