News February 7, 2025
‘పాలమూరు-రంగారెడ్డి’కి జాతీయ హోదా ఇవ్వలేం: కేంద్రం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738891162968_653-normal-WIFI.webp)
TG: పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంకు జాతీయ హోదా ఇవ్వలేమని కేంద్రం తేల్చి చెప్పింది. లోక్సభలో కాంగ్రెస్ MP బలరాం నాయక్ అడిగిన ప్రశ్నకు జలశక్తి సహాయమంత్రి రాజ్ భూషణ్ చౌదరి పైవిధంగా సమాధానమిచ్చారు. టెక్నికల్ అంశాలు, న్యాయపరమైన చిక్కులు అడ్డొస్తున్నాయన్నారు. AP, TGలో ఏ ఒక్క ఎత్తిపోతల పథకానికి హోదా ఇవ్వలేదని గుర్తుచేశారు. దీంతో విభజన చట్టం హామీని కేంద్రం విస్మరించిందని INC మండిపడింది.
Similar News
News February 7, 2025
బీసీలకు 42శాతం సీట్లు ఇచ్చేందుకు మేం సిద్ధం: పొన్నం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738901397956_1045-normal-WIFI.webp)
TG: ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న కులగణనను తమ ప్రభుత్వం పక్కాగా పూర్తి చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ‘బీసీలకు 42 శాతం సీట్లు ఇచ్చేందుకు మా పార్టీ సిద్ధం. వెనుకబడిన వర్గాలకు అన్యాయం జరగనివ్వం. కులగణనను దేశం మొత్తం చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నారు. BRS నేతలు సర్వేలో పాల్గొనలేదు. పైగా అవహేళన చేశారు. వెనుకబడిన వర్గాలకు ఆ పార్టీ క్షమాపణలు చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.
News February 7, 2025
జగన్ ‘క్యారెక్టర్’ కామెంట్స్.. స్పందించిన VSR
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738904867740_653-normal-WIFI.webp)
AP: రాజకీయాల్లో క్యారెక్టర్ ముఖ్యం అంటూ YS జగన్ చేసిన <<15377485>>వ్యాఖ్యలపై<<>> మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పందించారు. ‘వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్న వాడిని కాబట్టే ఎవరికి ఎలాంటి ప్రలోభాలకి లొంగలేదు. భయం అనేది నాలో ఏ అణువులోనూ లేదు కాబట్టే రాజ్యసభ పదవిని, పార్టీ పదవుల్ని, రాజకీయాలను వదులుకున్నా’ అని ట్వీట్ చేశారు.
News February 7, 2025
Good News: వడ్డీరేట్లు తగ్గించిన RBI
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738903225137_1199-normal-WIFI.webp)
ఎట్టకేలకు RBI గుడ్న్యూస్ చెప్పింది. రెపోరేటును 25 బేసిస్ పాయింట్ల మేర కత్తిరిస్తూ నిర్ణయం తీసుకుంది. 6.50 నుంచి 6.25 శాతానికి తగ్గించింది. 2024, Feb 8 నుంచి వడ్డీరేట్లు 6.50% వద్దే గరిష్ఠంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ద్రవ్యోల్బణం కుదుటపడుతోందని RBI గవర్నర్ సంజయ్ మల్హోత్ర తెలిపారు. వడ్డీరేట్ల తగ్గింపుతో ప్రజల చేతుల్లో డబ్బులు మిగులుతాయి. దీంతో వినియోగం పెరిగి ఎకానమీ పుంజుకోనుంది.