News January 5, 2025

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జైపాల్ రెడ్డి పేరు

image

TG: రాష్ట్ర ప్రభుత్వం రెండు నీటిపారుదల ప్రాజెక్టుల పేర్లను మార్చింది. ఉమ్మడి MBNR జిల్లాలోని పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి పేరును పెట్టింది. ఇక ఉమ్మడి మెదక్ జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు కెనాల్‌కు మంత్రి దామోదర రాజనర్సింహ తండ్రి అయిన రాజనర్సింహ పేరును ఖరారు చేసింది.

Similar News

News December 24, 2025

ఏటా నాలుగుసార్లు ఓటర్ల నమోదు

image

AP: గ్రామ పంచాయతీ ఓటర్ల లిస్టును ఏటా 4 సార్లు సవరణ చేసుకునేలా పంచాయతీ రాజ్ చట్టాన్ని సవరిస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ ఇచ్చింది. దీనికి గవర్నర్ జస్టిస్ నజీర్ ఆమోదం తెలపడంతో తాజాగా కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులిచ్చింది. గతంలో ఏటా JAN 1 నాటికి ఓటర్ల జాబితాలో నమోదు, మార్పులు చేసుకునే అవకాశం ఉండేది. ఇకపై APR 1, జులై 1, OCT 1న కూడా రివిజన్‌ చేసుకోవచ్చు. దీంతో 18 ఏళ్ల యువత ఎప్పుడైనా పేర్లను నమోదు చేసుకోవచ్చు.

News December 24, 2025

వైకుంఠ ఏకాదశి ప్రత్యేక పూజ

image

వైకుంఠ ద్వారాలు తెరుచుకునే పవిత్ర పర్వదినాన శ్రీమహావిష్ణువు అనుగ్రహం పొందాలనుకుంటున్నారా? మీ ఆర్థిక, కుటుంబ సమస్యల నుంచి విముక్తి లభించి, సకల ఐశ్వర్యాలు కలగాలని కోరుకుంటున్నారా? అయితే మీకు వైకుంఠ ఏకాదశి ప్రత్యేక పూజ ఉత్తమమైనది. మీ పేరు, గోత్రనామాలతో జరిపించే సంకల్ప పూజ ద్వారా పాప విముక్తి పొంది, మోక్ష మార్గంలో పయనించవచ్చు. ఇప్పుడే వేదమందిర్‌లో మీ పూజను <>బుక్ చేసుకోండి<<>>.

News December 24, 2025

మహిళలపై ఇన్ఫ్లమేషన్ ప్రభావం

image

ఇన్‌ఫ్లమేషన్ అంటే సాధారణ భాషలో వాపు అని అర్థం. క్యాన్సర్, గుండె జబ్బులు, షుగర్, ఆర్థరైటిస్, డిప్రెషన్, అల్జీమర్స్ వంటి అనేక వ్యాధులకు ఇది కారణం అవుతుందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా మహిళల్లో జననాంగ ఇన్ఫెక్షన్, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్, ఫైబ్రాయిడ్లు, జీర్ణ సమస్యలు, చర్మసమస్యలు వంటివి వస్తాయి. ఇన్‌ఫ్లమేషన్ తగ్గాలంటే స్వీట్లు, ప్రాసెస్డ్ ఫుడ్, మద్యపానానికి దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.