News June 16, 2024

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ నియామకం

image

AP: టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా గాజువాక MLA పల్లా శ్రీనివాసురావు యాదవ్‌ని చంద్రబాబు నియమించారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. నూతన బాధ్యతలను శ్రీనివాసరావు విజయవంతంగా నిర్వహిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్నాయుడు పార్టీ బలోపేతానికి ఎనలేని కృషి చేశారని కొనియాడారు. కాగా ఇటీవలి ఎన్నికల్లో పల్లా రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ(95,235)తో గాజువాక నుంచి గెలుపొందారు.

Similar News

News November 24, 2025

ముంబైలో “పాతాళ్ లోక్” నెట్‌వర్క్‌

image

ముంబైని ‘ట్రాఫిక్ ఫ్రీ’ నగరంగా తీర్చిదిద్దేందుకు MH ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ముంబైలో భారీ టన్నెల్‌ నెట్‌వర్క్‌ నిర్మిస్తామని CM దేవేంద్ర ఫడణవీస్ ప్రకటించారు. ఈ టన్నెల్‌ నెట్‌వర్క్‌ ఇప్పటికే ఉన్న రోడ్లతో ప్యారలల్‌గా ఉంటుందని తెలిపారు. ఈ సొరంగ మార్గాన్ని ఫేమస్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘పాతాళ్ లోక్’తో ఫడణవీస్ పోల్చారు. ఈ నెట్ వర్క్‌తో ముంబై ప్రజల ట్రాఫిక్ కష్టాలు తీరుతాయని చెప్పారు.

News November 24, 2025

3 సిక్సులు కొట్టడమే గొప్ప!

image

పాకిస్థాన్‌కు చెందిన జీరో స్టూడియోస్‌ ఆ దేశ క్రికెటర్‌ సాహిబ్జాదా ఫర్హాన్‌పై “Hero in the Making” అనే డాక్యుమెంటరీ తీసింది. దానికి అసలు కారణం ఏంటంటే ఆసియా కప్‌ 2025లో అతను బుమ్రా బౌలింగ్‌లో 3 సిక్సులు కొట్టడమే. కాగా ఆసియా కప్‌లో భారత్‌తో జరిగిన 3 మ్యాచ్‌ల్లోనూ పాక్‌ ఓడిపోవడం తెలిసిందే. దీంతో ‘3 సిక్సులు కొట్టడాన్నే వీళ్లు సక్సెస్‌గా ఫీల్ అవుతున్నారు’ అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

News November 24, 2025

భారత్ డైనమిక్స్ లిమిటెడ్‌లో 156 పోస్టులు

image

HYDలోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (<>BDL<<>>) 156 అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. టెన్త్, ఐటీఐ అర్హతగల అభ్యర్థులు నేటి నుంచి డిసెంబర్ 8 వరకు అప్లై చేసుకోవచ్చు. www.apprenticeshipindia.gov.in పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దరఖాస్తు హార్డ్ కాపీని డిసెంబర్ 12లోపు పంపాలి. టెన్త్, ఐటీఐలో సాధించిన మార్కులు, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://bdl-india.in/