News April 6, 2024
పోషకాల తాటి ముంజలు

ఎండాకాలం వచ్చిందంటే వేడి నుంచి ఉపశమనం కలిగించే తాటి ముంజలు అందుబాటులో ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే వీటి అమ్మకాలు జోరందుకున్నాయి. ప్రజలు వీటిని కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ముంజల్లో ఐరన్, క్యాల్షియం, మిటమిన్-ఏ, బీ, సీలతో పాటు జింక్, పొటాషియం, ఫాస్ఫరస్లు అధికంగా ఉంటాయి. ఇవి తినడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
Similar News
News October 24, 2025
నారద భక్తి సూత్రాలు – 7

‘సా న కామయమానా, నిరోధ రూపత్వాత్’
నారదుడి ఈ భక్తి సూత్రం భగవంతుని పట్ల ప్రేమ నిస్వార్థమైనదని సూచిస్తుంది. సాధారణంగా కోరికలు అనేవి మనసును కలవరపాటుకు గురిచేస్తాయి. కానీ నిజమైన భక్తిలో కోరికలు ఉండవు. భక్తి స్వభావం మనసులోని లౌకిక కోరికలను, వాంఛలను విస్మరిస్తుంది. భగవంతునిపై మనస్సును నిలపడం ద్వారా, ఇతర ఆకర్షణలను మనస్సు దానంతటదే వదిలిపెడుతుంది. అందువల్లే నిస్వార్థమైన భక్తి చాలా గొప్పది. <<-se>>#NBS<<>>
News October 24, 2025
మరో అల్పపీడనం.. ఇవాళ భారీ వర్షాలు

AP: బంగాళాఖాతంలో ఇవాళ మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని APSDMA తెలిపింది. దీని ప్రభావంతో కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. కోస్తా తీరం వెంబడి 35-55 కిమీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించారు.
News October 24, 2025
శివుడి మాట కాదని పుట్టింటికి వెళ్లిన సతీదేవి

దక్షప్రజాపతి తాను చేయబోయే యజ్ఞానికి సమస్త దేవతలను, రుషులను, బంధువులను ఆహ్వానించాడు. కానీ కన్న కూతురైన సతీదేవిని, అల్లుడు శివుడిని మాత్రం ఆహ్వానించలేదు. ఈ విషయం తెలుసుకున్న సతీదేవి, శివుడు వద్దన్నా పుట్టింటికి బయలుదేరింది. తల్లిదండ్రులపై ఉన్న మమకారంతో నందీశ్వరుని అనుమతి తీసుకుని, శివగణాలను వెంటబెట్టుకుని దక్షప్రజాపతి ఇంటికి చేరింది. శివుడు చెప్పినట్లే ఆమెకు అక్కడ అవమానం ఎదురైంది. <<-se>>#Shakthipeetham<<>>


