News March 17, 2024
పల్నాడు: ‘జిల్లాలో స్పందన కార్యక్రమాలు రద్దు’

ప్రతి సోమవారం పల్నాడు జిల్లా కలెక్టరేట్లో జరిగే స్పందన కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ శివ శంకర్ తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున స్పందన కార్యక్రమాన్ని రద్దు చేశామన్నారు. మండల స్థాయిలో, డివిజన్ స్థాయిలో నిర్వహించే స్పందన కార్యక్రమాలు కూడా రద్దు చేసినట్లు తెలిపారు. ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించాలని కోరారు.
Similar News
News April 3, 2025
11వ తేదీలోగా అభ్యంతరాలు తెలపండి: డీఈవో

అర్హులైన ఉపాధ్యాయులకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించేందుకు సీనియారిటీ జాబితా సిద్ధమైంది. సీనియారిటీ జాబితా విద్యాశాఖ వెబ్ సైట్లో ఉంచడం జరిగిందని డీఈవో రేణుక చెప్పారు. సీనియారిటీ జాబితాపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈనెల 11వ తేదీలోగా తెలపాలని సూచించారు. ఈ మేరకు డీఈవో రేణుక గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. పారదర్శకంగా ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియ సాగుతుందన్నారు.
News April 3, 2025
గుంటూరు: వృద్ధురాలిపై కర్రలతో దాడి.. మృతి

గుంటూరు నగరంలోని ఆనందపేటలో రెండు వర్గాల మధ్య గురువారం ఘర్షణ జరిగింది. పాత కక్షల నేపథ్యంలో హర్షద్ కుటుంబ సభ్యులపై ఫిరోజ్, ఫరోజ్‌తో పాటు మరికొందరు దాడి చేశారు. ఈ దాడిలో షేక్ ఖాజాబీ(75) మరణించింది. హర్షద్ తల్లిదండ్రులు షాజహాన్, బాబులకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనపై లాలాపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎలాంటి ఘర్షణలకు తావు లేకుండా ఆ ప్రాంతంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు.
News April 3, 2025
అమరావతి: నేటితో మంత్రివర్గ సమావేశం ముగింపు

సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. గురువారం ఈ సమావేశంలో పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపారు. ఏపీ డ్రోన్ కార్పొరేషన్‌ను ఫైబర్ నెట్ లిమిటెడ్ నుంచి విడదీసి స్వతంత్ర సంస్థగా ఏర్పాటు చేసేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో డ్రోన్ సంబంధిత అంశాలన్నిటికీ నోడల్ ఏజెన్సీగా ఏపీడీసీ వ్యవహరించనుంది. అనకాపల్లి జిల్లాలోని క్యాపిటివ్ పోర్టు ఏర్పాటుకు ఆమోదం తెలిపారు.