News July 17, 2024

పల్నాడు: నడిరోడ్డుపై చేతులు నరికేశాడు

image

AP: పల్నాడు(D) వినుకొండలో ఘోరం జరిగింది. ముళ్లమూరు బస్టాండ్ సెంటర్‌లో బుధవారం రాత్రి రషీద్ అనే యువకుడిపై జిలానీ అనే వ్యక్తి అందరూ చూస్తుండగా నడిరోడ్డుపై విచక్షణారహితంగా కత్తితో దాడి చేశాడు. దాడిలో రషీద్ చేయి తెగిపడింది. రక్తపు మడుగులో పడి ఉన్న బాధితుడిని పోలీసులు ఆసుపత్రికి తరలించగా ప్రాణాలు కోల్పోయారు. కాగా హత్య చేసిన జిలానీ TDP వ్యక్తి అని YCP ఆరోపిస్తోంది. నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు.

Similar News

News December 1, 2025

వయస్సును వెనక్కి తిప్పే బొటాక్స్

image

వయసు మీద పడుతున్నా యవ్వనంగా కనిపించేలా చేయడానికి అనేక రకాల చికిత్సలున్నాయి. వాటిల్లో ఒకటే బొటాక్స్. ముఖంపై ముడతలను పోగొట్టడానికి ఇచ్చే ఒక న్యూరో టాక్సిన్‌ ప్రొటీన్‌ ఇది. దీనిని బ్యాక్టీరియం క్లోస్ట్రిడియం బొటులినమ్‌ అనే బ్యాక్టీరియా ఉత్పత్తి చేస్తుంది. దీనిని మన కండరాల్లోకి చొప్పిస్తే చర్మంపై గీతలు, ముడతలు తగ్గి మృదువుగా కనిపిస్తుంది. సంవత్సరానికి 2-3 మూడు ఇంజెక్షన్లు చేయాల్సి ఉంటుంది.

News December 1, 2025

డ్రామాపైనే మోదీ దృష్టి: ఖర్గే

image

ముఖ్యమైన అంశాలపై చర్చించడం కంటే డ్రామాపై ప్రధాని మోదీ ఎక్కువ దృష్టి పెట్టారని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. గత 11 ఏళ్లుగా ప్రభుత్వం పార్లమెంటరీ మర్యాదను దెబ్బతీస్తోందని ఆరోపించారు. గత పార్లమెంట్ సమావేశాల్లో కనీసం చర్చించకుండా 15 నిమిషాల్లోనే కొన్ని బిల్లులు పాస్ చేసిందని విమర్శించారు. సాగు చట్టాలు, జీఎస్టీ సవరణలు, సీఏఏపై తగిన చర్చ లేకుండా పార్లమెంటును బుల్డోజ్ చేసిందన్నారు.

News December 1, 2025

దిత్వా ఎఫెక్ట్.. వరి కోత యంత్రాలకు పెరిగిన డిమాండ్

image

తెలుగు రాష్ట్రాల్లో వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ తరుణంలో దిత్వా తుఫాన్ రావడంతో.. వరి పండిస్తున్న రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తుఫానుకు తమ పంట ఎక్కడ దెబ్బతింటుందో అని చాలా మంది రైతులు వరి కోత సమయం రాకముందే కోసేస్తున్నారు. దీంతో వరి కోత యంత్రాలకు డిమాండ్ పెరిగింది. ఇదే అదనుగా కోత యంత్రాల యజమానులు.. ఎకరా పంట కోయడానికి రూ.4వేలకు పైగా వసూలు చేస్తున్నట్లు రైతులు వాపోతున్నారు.