News July 18, 2024

పల్నాడు మర్డర్.. వారిద్దరూ YCP వారే: TDP

image

AP: పల్నాడు <<13650476>>ఘటనలో<<>> చనిపోయిన రషీద్, నిందితుడు జిలానీ ఇద్దరూ YCP వారేనని TDP ట్వీట్ చేసింది. ‘వినుకొండలో రౌడీషీటర్, YCP నేత PS ఖాన్‌కు ప్రధాన అనుచరులు. ఈ PS ఖాన్ జగన్‌కు ప్రధాన అనుచరుడు. బాబాయ్‌ని లేపించి, చంద్రబాబు చంపాడని పేపర్లో వేసిన నీచ చరిత్ర వీళ్లది. ఏది జరిగినా TDP మీద తోసేయడమే. అయినా తప్పు ఎవడు చేసినా తప్పే. నిందితుడిని కఠినంగా శిక్షించడమే మా ప్రభుత్వ లక్ష్యం’ అని రాసుకొచ్చింది.

Similar News

News January 22, 2025

త్వరలోనే సర్పంచ్ ఎన్నికలు: మంత్రి సీతక్క

image

TG: సర్పంచ్ ఎన్నికలను త్వరలోనే నిర్వహిస్తామని మంత్రి సీతక్క వెల్లడించారు. బీసీ కమిషన్ రిపోర్టు దాదాపుగా పూర్తయిందని, సీఎం రేవంత్ దావోస్ నుంచి వచ్చాక ఆ రిపోర్టును ఆమోదిస్తారని తెలిపారు. పథకాల లబ్ధిదారులను గ్రామ సభల ద్వారానే ఎంపిక చేస్తున్నామని, 96% గ్రామాల్లో ఈ ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతోందని చెప్పారు. అర్హులైన అందరికీ రేషన్ కార్డులు, పథకాలు అందిస్తామని స్పష్టం చేశారు.

News January 22, 2025

‘గోల్డ్ రా మన తమన్ అన్న’

image

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ నెటిజన్లు అడిగే ప్రశ్నలకు రిప్లై ఇస్తుంటారు. తాజాగా ఓ యువకుడు తన బాధను తమన్ దృష్టికి తీసుకెళ్లగా సాయం చేసేందుకు ముందుకొచ్చారు. తాను ఓ రిథమ్ ప్యాడ్ ప్లేయర్ అని, అది పాడైపోయిందని చెప్పడంతో కొత్తది కొనిస్తానని హామీ ఇచ్చారు. వివరాలు చెప్పాలని కోరారు. దీంతో తమన్‌పై ప్రశంసలు వెల్లువెత్తాయి. తమన్ గోల్డ్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

News January 22, 2025

జియో, AirTel వాడుతున్నారా?

image

ఇంటర్నెట్ వాడని యూజర్లకు ఖర్చు తగ్గించేందుకు కాల్స్, SMSల కోసం ప్రత్యేక ప్లాన్లు తేవాలని ట్రాయ్ చెప్తే టెలికం కంపెనీలు మాత్రం తమకు అనుకూలంగా వాడేసుకుంటున్నాయి. ఇప్పటికే ఉన్న ప్లాన్లలో డేటా కట్ చేసి రేట్లు అలాగే ఉంచాయి. డేటా ఉండే రూ.479 ప్యాక్ ధరను జియో రూ.60 పెంచి రూ.539గా నిర్ణయించింది. రూ.1,999 ప్లాన్ ధరను రూ.350 పెంచి రూ.2,249 చేసింది. అటు AirTel సైతం డేటా తొలగించి, ప్లాన్ రేట్లను పెంచింది.