News July 18, 2024

పల్నాడు హత్య ఘటన అత్యంత దారుణం: రోజా

image

AP: పల్నాడు(D) వినుకొండలో YCP కార్యకర్త రషీద్‌ను నడిరోడ్డుపై అత్యంత కిరాతకంగా కత్తితో నరికి చంపడం దారుణమని మాజీ మంత్రి రోజా మండిపడ్డారు. ‘మీకు ప్రజలు అధికారం ఇచ్చింది సంక్షేమం చేయమని చంద్రబాబు గారు. ఇలా ప్రత్యర్థి పార్టీ నాయకులను, కార్యకర్తలను చంపడానికి కాదు’ అని ట్వీట్ చేశారు. హత్యలు, దాడులు, దౌర్జన్యాలు, ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తుల ధ్వంసంతో ఏపీని హత్యాంధ్రప్రదేశ్‌‌గా మార్చారని ఆరోపించారు.

Similar News

News December 4, 2025

నేడు మార్గశిర పౌర్ణమి.. ఏం చేయాలంటే?

image

మార్గశిర మాసంలో గురువారాన్ని ప్రత్యేకంగా భావిస్తారు. నేడు ఈ వారం పౌర్ణమి తిథితో కలిసి వచ్చింది. కాబట్టి నేడు లక్ష్మీదేవితో పాటు చంద్రున్ని కూడా పూజిస్తే విశేష ఫలితాలుంటాయని పండితులు అంటున్నారు. ఈరోజు లక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తే అష్టలక్ష్మీ వైభవం కలుగుతుందని, చంద్రుడికి అర్ఘ్యం సమర్పిస్తే మానసిక శాంతి లభిస్తుందని చెబుతున్నారు. ☞ ఈ వ్రతాలు ఎలా, ఏ సమయంలో చేయాలో తెలుసుకోవడానికి క్లిక్ <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.

News December 4, 2025

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

image

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<>BEL<<>>) కోట్‌ద్వారా యూనిట్‌లో 14 ఇంజినీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ, టెక్నీషియన్ C పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు ఈ నెల 23 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిప్లొమా, టెన్త్, ITI, అప్రెంటిషిప్ ఉత్తీర్ణులైన, 28ఏళ్లలోపు అభ్యర్థులు అర్హులు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష (CBT) ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://bel-india.in/

News December 4, 2025

వ్యర్థాలు తగలబెడితే సాగుకు, రైతుకూ నష్టం

image

సుమారు 80-90 శాతం రైతులు పంటకాలం పూర్తయ్యాక మిగిలిన వరి కొయ్యలను, పత్తి, మిరప, మొక్కజొన్న కట్టెలను పొలంలోనే మంటపెట్టి కాల్చేస్తున్నారు. ఈ సమయంలో విడుదలయ్యే వేడితే భూమి సారాన్ని కోల్పోతుంది. పంట పెరుగుదలకు అవసరమయ్యే సేంద్రియ కర్బనం, నత్రజని, పాస్పరస్‌ లాంటి పోషకాల శాతం తగ్గుతుంది. పంట వ్యర్థాలను తగలబెట్టేటప్పుడు విడుదలయ్యే పొగ వల్ల తీవ్ర వాతావరణ కాలుష్యంతో పాటు రైతుల ఆరోగ్యం కూడా దెబ్బతింటోంది.