News March 18, 2026

‘PAN’ కార్డుకు అప్లై చేస్తున్నారా?

image

కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి పాన్ కార్డు అప్లికేషన్ నిబంధనల్లో మార్పులు రానున్నాయి. ప్రస్తుతం పాన్ కార్డు పొందేందుకు ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. కానీ ఏప్రిల్ 1 నుంచి ఆధార్‌తో పాటు బర్త్ సర్టిఫికెట్, ఓటర్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్‌లో ఏదో ఒక ప్రూఫ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటి PAN అప్లికేషన్ ఫామ్స్ కూడా చెల్లవని ప్రభుత్వం పేర్కొంది. అలాగే ఆధార్‌పై ఉన్న పేరునే PAN కార్డుపై ముద్రిస్తారు.

Similar News

News April 14, 2026

ఆ విషయంలో వైభవ్ హ్యాపీగా లేడు: అసిస్టెంట్ కోచ్

image

యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని ఇంపాక్ట్ ప్లేయర్‌గా పంపడంపై RR అసిస్టెంట్ కోచ్ ట్రెవోర్ పెన్నీ స్పందించారు. ‘ఫెరీరా గాయంతో బాధపడుతుండటంతో ప్రారంభ మ్యాచుల్లో సూర్యవంశీని పూర్తిగా ఆడించాం. ఫెరీరా కోలుకోవడంతో జట్టులోకి తీసుకున్నాం. అందుకే వైభవ్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా బ్యాటింగ్‌కు పంపుతున్నాం. అంతేతప్ప ఫీల్డింగ్ చేయట్లేదని కూర్చోపెట్టడం లేదు. ఈ విషయంలో అతడు సంతోషంగా లేడు’ అని తెలిపారు.

News April 14, 2026

ముఖంపై ముడతలు తగ్గించే ఫేస్ ప్యాక్

image

యవ్వనంగా కనిపించే చర్మం కోసం రసాయన ఉత్పత్తులకు బదులు ఇంట్లోని సహజ పదార్థాలను వాడితే చాలు. వాటిల్లో ఒకటే ఈ అరటిపండు ఫేస్ ప్యాక్. బాగా మగ్గిన అరటిపండును తీసుకొని కాస్త తేనె, బార్లీ పౌడర్ కలిపి పేస్ట్ చేయాలి. బార్లీకి బదులు బియ్యప్పిండి కూడా వాడొచ్చు. ఈ మిశ్రమాన్ని ముఖానికి అరగంట ఉంచిన తర్వాత కడిగేయాలి. వారానికోసారి ఈ ప్యాక్ వేస్తే చర్మం యవ్వనంగా మారుతుంది.

News April 14, 2026

చల్లదనం కోసం బీర్లు తాగుతున్నారా?

image

వేసవిలో బీర్లు తాగితే శరీరం కూల్ అవుతుందనేది అపోహ మాత్రమేనని నిపుణులు చెబుతున్నారు. విపరీతంగా తాగితే మూత్ర విసర్జన పెరిగి శరీరంలోని నీరు అధికమొత్తంలో బయటకు వెళ్లిపోతుందని పేర్కొంటున్నారు. దీనివల్ల డీహైడ్రేషన్ ఏర్పడుతుందని హెచ్చరిస్తున్నారు. అలాగే పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోతుందని, కాలేయ, జీర్ణ సమస్యలు, నిద్ర పట్టకపోవడం, రక్తపోటు సమస్యలు వస్తాయంటున్నారు.
#ShareIt