News July 16, 2024

పాన్ కార్డు ఉన్నవారికి రైతుభరోసా రాదా? మంత్రి ఏమన్నారంటే?

image

TG: పాన్ కార్డు ఉన్న రైతులకు రైతు భరోసా ఇవ్వరని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అలాంటిదేమీ లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పంట మీద వచ్చిన ఆదాయానికి ఒక్క రూపాయి కూడా ట్యాక్స్ ఉండదని చెప్పారు. రైతు భరోసాపై అభిప్రాయ సేకరణలో నిన్న హనుమకొండలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు కడుతూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు.

Similar News

News January 23, 2026

350 పోస్టులు.. దరఖాస్తుల ఆహ్వానం

image

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 350 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి CFA/CA, MBA, PGDBA, PGDBM, PGDM, CAIIB, IIBF, CITF, NISM సర్టిఫికెట్‌తో పాటు పని అనుభవం గలవారు FEB 3 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 22-30ఏళ్ల మధ్య ఉండాలి (రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు). రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. https://centralbank.bank.in *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.

News January 23, 2026

నేడు శ్రీవారి పలు దర్శన టోకెన్లు విడుదల

image

AP: తిరుమల వేంకటేశ్వరుడి దర్శనానికి సంబంధించి పలు సేవల టోకెన్లు ఇవాళ రిలీజ్ కానున్నాయి. శ్రీవారి అంగ ప్రదక్షిణ టోకెన్ల కోటా ఉదయం 10గంటలకు TTD విడుదల చేయనుంది. శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్ల కోటా ఉదయం 11గంటలకు రిలీజ్ కానుంది. వయోవృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక శ్రీవారి దర్శన టోకెన్లు 3pmకు విడుదల చేయనున్నారు. అటు అధికారిక వెబ్‌సైట్‌‌ను ఫాలో కావాలని, దళారులను నమ్మొద్దని TTD హెచ్చరిస్తోంది.

News January 23, 2026

AP SETకు అప్లై చేశారా?

image

ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్(AP SET-2025)కు అప్లై చేయడానికి దరఖాస్తులు కోరుతున్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్ పోస్టులకు పోటీ పడేందుకు సెట్ అర్హత తప్పనిసరి. పీజీ అర్హత గల అభ్యర్థులు ఫిబ్రవరి 9వరకు అప్లై చేసుకోవచ్చు. ప్రస్తుతం పీజీ చివరి సంవత్సరం చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. మార్చి 28, 29 తేదీల్లో పరీక్ష నిర్వహిస్తారు. వెబ్‌సైట్: www.apset.net.in