News January 30, 2025
పాన్ వెబ్‌సైట్‌ను తమిళంలోనూ అందుబాటులోకి తేవాలి: సినీ హీరో

పాన్ కార్డు వెబ్సైట్, సంబంధిత వివరాలను తమిళ భాషలోనూ అందుబాటులోకి తీసుకురావాలని సినీ హీరో విజయ్ సేతుపతి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. పాన్ వెబ్సైట్ హిందీ, ఇంగ్లిష్ భాషల్లో మాత్రమే ఉండటంతో తమిళ్ మాట్లాడేవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. సమాచారం ప్రజలకు అర్థమయ్యే భాషలో ఉండాలని, అలా ఉంటేనే ఎలాంటి సమస్యలు ఉండవని అభిప్రాయపడ్డారు.
Similar News
News November 20, 2025
మంచిర్యాల: ఆయిల్ ఫామ్ సాగు విస్తీర్ణాన్ని పెంపొందించాలి: కలెక్టర్

జిల్లాలో ఆయిల్ ఫామ్ పంట సాగు విస్తీర్ణాన్ని పెంపొందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. జిల్లా కలెక్టరేట్లో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, జిల్లా వ్యవసాయ అధికారి సురేఖ జిల్లా ఉద్యానవన పట్టు పరిశ్రమ అధికారి అనిత, ఇతర అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో 2వేల ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్ ఫామ్ పంట సాగు లక్ష్యం కాగా ఇప్పటి వరకు 438ఎకరాలలో సాగు జరుగుతుందని, మిగతా లక్ష్యాన్ని సాధించాలన్నారు.
News November 20, 2025
మూవీ రూల్స్‌కు రీడైరెక్ట్ కావడంపై విచారణలో రవికి ప్రశ్నలు

ఐ-బొమ్మ కేసులో రవి పోలీస్ కస్టడీ తొలిరోజు ముగిసింది. వెబ్‌సైట్‌కు సంబంధించి కీలక విషయాలపై పోలీసులు ఆరా తీశారు. ఇవాళ వెలుగులోకి వచ్చిన ‘ఐబొమ్మ వన్’పైనా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. దాని నుంచి మూవీ రూల్స్‌కు రీడైరెక్ట్ కావడంపై రవిని అడిగారు. అతడు వాడిన మొబైల్స్ వివరాలు, నెదర్లాండ్స్‌లో ఉన్న హోమ్ సర్వర్ల డేటా, హార్డ్ డిస్క్‌ల పాస్వర్డ్, NRE, క్రిప్టో కరెన్సీ, పలు వ్యాలెట్లపై సుదీర్ఘంగా విచారించారు.
News November 20, 2025
అపార్ట్మెంట్లో అందరికీ ఒకే వాస్తు ఉంటుందా?

అపార్ట్మెంట్ ప్రాంగణం ఒకటే అయినా వేర్వేరు బ్లాక్‌లు, టవర్లలో దిశలు మారుతాయని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు తెలుపుతున్నారు. ‘సింహద్వారం దిశ, గదుల అమరిక వేర్వేరుగా ఉంటాయి. అందువల్ల ప్రతి ఫ్లాట్‌కి వాస్తు ఫలితాలు కూడా మారుతాయి. అందరికీ ఒకే వాస్తు వర్తించదు. ప్రతి ఫ్లాట్‌ని దాని దిశ, అమరిక ఆధారంగానే చూడాలి. మీ జన్మరాశి, పేరు ఆధారంగా వాస్తు అనుకూలంగా ఉందో లేదో చూడాలిలి’ అని సూచిస్తున్నారు. <<-se>>#Vasthu<<>>


