News September 1, 2024

ఆ తర్వాతే పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్: ఎస్ఈసీ

image

TG: ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేసిన తర్వాత పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి తెలిపారు. నిన్న రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. నోటిఫికేషన్ వచ్చే వరకూ ఓటర్ల నమోదు కొనసాగుతుందని, ఈనెల 6న ముసాయిదా జాబితా రిలీజ్ చేస్తామని తెలిపారు. కులగణన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని, BC రిజర్వేషన్లలను 42%కి పెంచాలని విపక్షాలు డిమాండ్ చేశాయి.

Similar News

News November 1, 2025

మైనారిటీలకు ఫ్రీగా టెట్ కోచింగ్: మంత్రి ఫరూక్

image

AP: మైనారిటీలకు ఉచితంగా టెట్ కోచింగ్ ఇవ్వనున్నట్లు మంత్రి ఫరూక్ తెలిపారు. సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ ద్వారా శిక్షణ ఇస్తామని చెప్పారు. త్వరలో క్లాసులు ప్రారంభం అవుతాయన్నారు. అభ్యర్థులు తమ వివరాలను <>https://apcedmmwd.org/<<>> వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం 0866-2970567, 7386789966 నంబర్లలో సంప్రదించవచ్చు.

News November 1, 2025

అదునులో పొదలో చల్లినా పండుతుంది

image

సక్రమంగా వర్షాలు కురిసి, నేల అదునుగా ఉన్నప్పుడు విత్తనాలు చల్లితే ఆ విత్తనాలు మొలకెత్తుతాయి. ఒకవేళ నేలమీద పొదలు అడ్డమున్నా ఆ పొదల నుంచి జారి నేలమీద పడ్డ గింజలు నేల అదునుగా ఉంటే పండితీరుతాయి. అలాగే సమయం, సందర్భం కలిసొచ్చినప్పుడు సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే విజయం తప్పక లభిస్తుందని తెలియజెప్పే సందర్భాలలో దీన్ని ఉపయోగిస్తారు.

News November 1, 2025

2 రోజుల్లో అల్పపీడనం.. AP, TGలో వర్షాలు

image

రానున్న 2 రోజుల్లో తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రానున్న 2 రోజుల్లో కోస్తా, రాయలసీమల్లో చెదురుమదురు వానలు పడతాయని పేర్కొంది. ఇవాళ కొన్ని చోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. అటు TGలో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశముంది.