News September 1, 2024
12,966 గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు!

TG: రాష్ట్రంలో 540 గ్రామీణ మండలాల్లోని 12,966 గ్రామాల్లో(1,14,620 వార్డులు) పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. వీటి జాబితాను పంచాయతీరాజ్ శాఖ ఈసీకి సమర్పించింది. గత ఎన్నికల్లో 535 మండలాల్లోని 12,732 గ్రామాల్లో (1,13,152 వార్డులు) ఎన్నికలు జరిగాయి. వాటితో పోలిస్తే ఈసారి 5 మండలాలు, 234 విలేజ్‌లు, 1,468 వార్డులు పెరిగాయి. ఈసారి అత్యధికంగా నల్గొండ(D) 868 గ్రామాల్లోని 7,482 వార్డుల్లో ఎలక్షన్స్ జరగనున్నాయి.
Similar News
News December 1, 2025
‘హిల్ట్’పై గవర్నర్‌కు BJP ఫిర్యాదు

TG: ‘హిల్ట్’ పేరిట ప్రభుత్వం భూదందాకు పాల్పడుతోందని BJP గవర్నర్‌కు ఫిర్యాదు చేసింది. 9,292.53 ఎకరాల భూమిని మల్టీపర్పస్‌కు వినియోగించేలా తక్కువ ధరకే అప్పగిస్తోందని, దీనివెనుక ₹5లక్షల CR స్కామ్ ఉందని ఆరోపించింది. వెంటనే జోక్యం చేసుకొని భూములను పరిరక్షించాలంది. ‘హిల్ట్’ను రద్దు చేసి రిటైర్డ్ జడ్జితో విచారించాలని పార్టీ చీఫ్ రామచందర్‌రావు, LP నేత మహేశ్వర్ రెడ్డి గవర్నర్‌కు అందించిన వినతిలో కోరారు.
News December 1, 2025
ధాన్యం కొనుగోళ్లు.. రూ.2,300 కోట్లు జమ చేేశాం: నాదెండ్ల

AP: రాష్ట్రంలో ప్రతి రైతు నుంచి ధాన్యం కొనుగోలు చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 11 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రూ.2,300 కోట్ల నగదును రైతుల అకౌంట్లలో జమ చేసినట్లు తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామన్నారు. ధాన్యం నిల్వలకు సంచుల కొరత లేకుండా చూస్తున్నామని, టార్పాలిన్లు ఉచితంగా రైతులకు అందిస్తున్నామని చెప్పారు.
News December 1, 2025
పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత

తన ప్రియుడు, డైరెక్టర్ రాజ్ నిడిమోరును వివాహమాడినట్లు స్టార్ హీరోయిన్ సమంత ప్రకటించారు. ఇవాళ్టి డేట్, లవ్ ఎమోజీలతో పెళ్లి ఫొటోలను ఆమె ఇన్‌స్టాలో షేర్ చేశారు. కోయంబత్తూరు ఈషా ఫౌండేషన్‌లోని లింగ భైరవ ఆలయంలో తొలుత నిశ్చితార్థం చేసుకొని, ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. ఉపాసన కొణిదెల, అనుపమతో పాటు తదితర సినీ ఇండస్ట్రీ ప్రముఖులు కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.


