News July 7, 2025
వచ్చే ఏడాది ‘పంచాయత్’ ఐదో సీజన్

కామెడీ డ్రామా సిరీస్ ‘పంచాయత్’ ఐదో సీజన్‌ను అనౌన్స్ చేసింది. ఈ సీజన్ వచ్చే ఏడాది స్ట్రీమింగ్ కానున్నట్లు అమెజాన్ ప్రైమ్ వీడియో పోస్టర్‌ను రిలీజ్ చేసింది. హిందీ భాషలో రూపొందిన ఈ సిరీస్ నాలుగు పార్టులు ఇతర భాషల ప్రేక్షకులనూ మెప్పించాయి. జితేంద్ర కుమార్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ సిరీస్‌ను తెలుగులో ‘సివరపల్లి’ పేరిట రీమేక్ చేసి ఈ ఏడాది జనవరిలో తొలి సీజన్‌ను రిలీజ్ చేశారు.
Similar News
News July 8, 2025
నేరాల నిరూపణకు టెక్నాలజీ వాడాలి: చంద్రబాబు

AP: RTGS రివ్యూలో CM చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘రాజకీయ ముసుగులో కొందరు నేరాలకు పాల్పడుతున్నారు. నేరాల నిరూపణకు టెక్నాలజీని వినియోగించాలి. కొందరు తెలివిగా నేరాలు చేసి ప్రభుత్వంపై నెపం వేస్తున్నారు. పోలీసులకు సహకరించని వారి విషయంలో అలర్ట్‌గా ఉండాలి. పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ కింద వారి నుంచి డేటా సేకరణకు చర్యలు చేపట్టాలి. నేరం చేసిన వారిని బాధ్యులను చేసే అంశంపై దృష్టి పెట్టాలి’ అని పేర్కొన్నారు.
News July 8, 2025
నిధికి పెళ్లి ప్రపోజల్.. హీరోయిన్ క్యూట్ రిప్లై

సాధారణంగా సెలబ్రిటీలు, ముఖ్యంగా సినీ తారలు నెట్టింట అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటారు. అలాగే, హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా #asknidhhi అంటూ ఫ్యాన్స్‌తో చిట్ చాట్ చేశారు. నెటిజన్స్ అంతా నిధి హీరోయిన్‌గా చేస్తున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా విశేషాలు అడిగారు. ఒకరు మాత్రం ‘మీ అమ్మగారి నంబరిస్తే మన పెళ్లి సంబంధం గురించి మాట్లాడతా’ అని అన్నారు. అందుకు నిధి ‘అవునా? నాటీ’ అంటూ క్యూట్‌గా రిప్లయ్ ఇచ్చారు.
News July 8, 2025
జులై 8: చరిత్రలో ఈరోజు

1497: భారత్‌కు వాస్కోడగామా ప్రయాణం ప్రారంభించిన రోజు
1914: బెంగాల్ దివంగత మాజీ సీఎం జ్యోతి బసు జననం
1919: తెలంగాణ తొలితరం దళిత కవి దున్న ఇద్దాసు మరణం
1921: దివంగత పారిశ్రామిక వేత్త ముళ్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్ జననం
1949: ఉమ్మడి ఏపీ మాజీ సీఎం YS రాజశేఖర రెడ్డి జయంతి
1966: సినీ నటి రేవతి జననం
1972: భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ జననం
1978: తొలితరం భావకవి నాయని సుబ్బారావు మరణం