News April 9, 2025

పంచాయతీ కార్యదర్శి ఆస్తి రూ.85 కోట్లు!

image

AP: తిరుపతి జిల్లా చంద్రగిరి పంచాయతీ EOగా పని చేసిన మహేశ్వరయ్య ఆస్తులు చూసి ACB అధికారులే షాక్ అయ్యారు. గత FEBలో అతడు రూ.50వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. తాజాగా తిరుపతి పేరూరులోని మహేశ్వరయ్య ఇంట్లో ACB సోదాలు జరిపింది. బెంగళూరులో రూ.10 కోట్ల విలువైన అపార్ట్‌మెంట్, పలమనేరులో 3 అంతస్తుల ఇల్లు, ఫాంహౌస్, బద్వేలులో భూములు, బంగారం ఉన్నట్లు గుర్తించారు. వాటి విలువ రూ.85 కోట్లకు పైగా ఉంటుందని అంచనా.

Similar News

News April 18, 2025

తిరుమలలో TTD ఛైర్మన్ ఆకస్మిక తనిఖీలు

image

AP: తిరుమలలో TTD ఛైర్మన్ BR నాయుడు ఆకస్మిక తనిఖీలు చేశారు. శ్రీవారిని దర్శించుకున్న భక్తులతో మాట్లాడి, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? అని అడిగి తెలుసుకున్నారు. TTD సాంకేతిక సేవల్లో కొన్ని లోపాలను ఓ భక్తుడు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు లడ్డూ, అన్నప్రసాదాలు రుచికరంగా ఉన్నాయని కొందరు తెలిపారు. అటు, దర్శన క్యూలైన్లనూ ఆయన పరిశీలించి.. భక్తులతో మర్యాదగా, సేవాభావంతో ప్రవర్తించాలని సిబ్బందిని ఆదేశించారు.

News April 18, 2025

IPL: అభిషేక్ జేబులు చెక్ చేసిన సూర్య కుమార్

image

MI, SRH మధ్య నిన్న ముంబై వాంఖడేలో జరిగిన మ్యాచ్‌లో ఆసక్తికర సన్నివేశం జరిగింది. SRH ఓపెనర్ అభిషేక్ శర్మ జేబులను సూర్యకుమార్ యాదవ్ చెక్ చేశారు. ఇటీవల పంజాబ్‌పై సెంచరీ చేసిన అనంతరం అభిషేక్ జేబులోంచి నోట్ తీసి ఆరెంజ్ ఆర్మీకి అంకితమంటూ సెలబ్రేషన్స్ చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిన్నటి మ్యాచ్‌లోనూ అలానే నోట్ రాసుకొచ్చారేమో అని SKY చెక్ చేయడం గ్రౌండ్‌లో నవ్వులు పూయించింది.

News April 18, 2025

కీవ్‌లో భారత ఫార్మా గోడౌన్‌పై దాడి.. ఉక్రెయిన్‌కు రష్యా కౌంటర్

image

కీవ్‌లో APR 12న భారత ఫార్మా గోడౌన్‌పై దాడి జరగ్గా, దానికి కారణం రష్యా క్షిపణి అని ఉక్రెయిన్ ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై రష్యా తాజాగా స్పందించింది.
ఉక్రెయిన్ క్షిపణుల వల్లే ఇది జరిగి ఉంటుందని కౌంటర్ ఇచ్చింది. ఆ దాడి తాము చేయలేదని భారత్‌లోని రష్యా ఎంబసీ స్పష్టం చేసింది. నివాస ప్రాంతాల్లో రాకెట్ లాంచర్లు, ఫిరంగులు సహా ఇతర సైనిక పరికరాలను మోహరించడం ఉక్రెయిన్‌కు పరిపాటిగా మారిందని మండిపడింది.

error: Content is protected !!