News May 25, 2024
నటాషాకి 70% ఆస్తిని ఇవ్వనున్న పాండ్య?

హార్దిక్ – నటాషా విడాకుల వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. తాజాగా పాండ్య తన ఆస్తిలోని 70శాతం వాటాను నటాషాకు ఇవ్వనున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే, విడాకుల వార్తలపై ఓ రెడ్డిట్ యూజర్ చేసిన పోస్ట్ వైరలవుతోంది. ‘భార్య పుట్టినరోజైన మార్చి 4న పాండ్య ఎలాంటి పోస్ట్ చేయలేదు. పాండ్యకు సపోర్ట్ చేసేందుకు ఆమె స్టేడియానికి రాలేదు. జట్టు గెలుపోటములపై ఒక్కసారీ స్పందించలేదు’ అని పోస్ట్ చేశారు.
Similar News
News January 26, 2026
VASTHU: గేటు ఏ వైపున ఉండాలంటే?

ఇంటి ప్రధాన గేటు సింహద్వారానికి ఎదురుగా ఉండాలని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ప్రహరీ గోడ వెడల్పును బట్టి అవసరమైన సంఖ్యలో గేట్లు ఏర్పాటు చేసుకోవాలంటున్నారు. ‘విడిగా చిన్న గేటు కావాలనుకుంటే తూర్పు ఈశాన్యం, ఉత్తర ఈశాన్యం, దక్షిణ ఆగ్నేయం, పడమర వాయువ్యంలో అమర్చుకోవాలి. పొరపాటున కూడా దక్షిణ నైరుతి, పడమర నైరుతిలో గేట్లు పెట్టకూడదు. ఇది సమస్యలకు దారితీస్తుంది’ అంటున్నారు. Vasthu
News January 26, 2026
ఫ్రెండ్ పెళ్లి కోసం 15 కేజీలు తగ్గిన మహిళ.. చివరికి!

తన బెస్ట్ ఫ్రెండ్ పెళ్లిలో అందంగా కనిపించడం కోసం చైనాలో జియాయు అనే 26 ఏళ్ల యువతి కఠిన డైట్ పాటించింది. రోజూ 10KM రన్నింగ్ చేస్తూ తక్కువ మొత్తంలో వెజిటబుల్స్, చికెన్ తినేది. దీంతో 2 నెలల్లోనే 15KGల బరువు తగ్గింది. ఆమె తన డైట్ నుంచి కార్బొహైడ్రేట్స్ను తీసేయడం, హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ వల్ల ప్రీ డయాబెటిస్ బారిన పడింది. డాక్టర్ల వార్నింగ్తో ఆమె డైటింగ్ను ఆపేసింది.
News January 26, 2026
బాలిక ప్రాణం తీసిన చైనా మాంజా

TG: హైదరాబాద్లో విషాదం చోటుచేసుకుంది. చైనా మాంజా మరొకరి ప్రాణం తీసింది. తండ్రితో కలిసి బైక్పై వెళ్తున్న ఐదేళ్ల నిష్విక(5) మెడను మాంజా మహమ్మారి కోసేసింది. దీంతో తీవ్ర రక్తస్రావంతో చిన్నారి విలవిల్లాడింది. తండ్రి వెంటనే బాలికను ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. <<18870079>>చైనా మాంజా<<>>పై ఇండియాలో నిషేధం ఉన్నా, పోలీసుల హెచ్చరికలు ఉన్నా వాటి అమ్మకాలు ఆగకపోవడం శోచనీయం.


