News October 5, 2025
పార్వతీ దేవి పెంచిన ప్రాణమే ‘పంజుర్లి’

కాంతార మూవీలోని ‘పంజుర్లి’ దైవం వెనుక ఓ కథ ప్రాచుర్యంలో ఉంది. దాని ప్రకారం.. శివుని స్వర్గపు తోటలో ఓ పంది చనిపోతుంది. దాని బిడ్డను పార్వతి పెంచుతుంది. కానీ అది పెద్దయ్యాక విధ్వంసకరంగా మారుతుంది. తోటని నాశనం చేస్తుంది. దీంతో శివుడు దాన్ని చంపాలనుకుంటాడు. అప్పుడు పార్వతి క్షమించమని కోరుతుంది. దీంతో శివుడు దాని శక్తి పొలాలు, ప్రజలను కాపాడేలా వరమిస్తాడు. అలా ‘పంజుర్లి’ తులు ప్రజల దైవమైంది.<<-se>>#kanthara<<>>
Similar News
News March 18, 2026
SRH కెప్టెన్‌గా ఇషాన్ కిషనే ఎందుకు?

SRH కెప్టెన్‌గా ఇషాన్ కిషన్ ఎంపిక దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఉన్నప్పటికీ ప్రస్తుత ఫామ్, నాయకత్వ లక్షణాల వల్లే అతడి వైపు ఫ్రాంచైజీ మొగ్గు చూపిందని సమాచారం. ఝార్ఖండ్ జట్టుకు తొలిసారి SMAT ట్రోఫీ అందించడంతోపాటు అద్భుత ఆటతో భారత జట్టులోకి ఇషాన్ రీఎంట్రీ ఇచ్చారు. దీంతో బ్యాటింగ్‌లో తడబడుతున్న అభిషేక్‌తో పోలిస్తే ఇషాన్‌ను SRH ఫస్ట్ ఛాయిస్‌గా చూసినట్లు టాక్. మీరేమంటారు?
News March 18, 2026
దివ్యాంగులకు ఉచిత ప్రయాణం.. పాస్‌లు ఇలా తీసుకోండి!

AP: RTC బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సదుపాయం నేటి నుంచి అందుబాటులోకి రానుంది. ‘దివ్యాంగ శక్తి’ పథకానికి అమరావతిలో CM CBN శ్రీకారం చుట్టనున్నారు. నియోజకవర్గాల్లో MLAలు ప్రారంభిస్తారు. రాష్ట్రంలోని బస్‌పాస్ కౌంటర్లలో సర్టిఫికెట్లు చూపించి పాస్‌లు తీసుకోవచ్చు. APSRTC యాప్, మనమిత్ర యాప్ ద్వారా కూడా డిజిటల్ పాస్ పొందొచ్చు. ఈ స్కీమ్‌తో రాష్ట్రంలో 11.16 లక్షల మంది దివ్యాంగులకు లబ్ధి కలగనుంది.
News March 18, 2026
జూన్‌లో గ్రూప్స్ నోటిఫికేషన్?

AP: గ్రూప్-1,2 పోస్టుల భర్తీకి APPSC సిద్ధమవుతోంది. జూన్‌లో నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. వివిధ ప్రభుత్వ శాఖల నుంచి సేకరించిన డేటా ప్రకారం గ్రూప్-1లో 101 పోస్టులు, గ్రూప్-2లో 470 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. గ్రూప్-1 ప్రిలిమ్స్ ఆగస్టులో, గ్రూప్-2కు సెప్టెంబర్‌లో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. ఈ పోస్టులకు ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది.


