News August 22, 2024
మజిల్ మెమరీతో పంత్ సెన్సేషన్

రిషభ్ పంత్‌లో మజిల్ మెమరీ, గెలుపు తృష్ణ ఉన్నాయని ఆసీస్ మాజీ క్రికెటర్ మాథ్యూ హెడెన్ అన్నారు. అవే అతడిని చివరి పర్యటనలో సంచలనంగా మార్చేశాయని తెలిపారు. త్వరలో జరిగే బోర్డర్-గవాస్కర్ టోర్నీలో టీమ్ఇండియాకు అతడే కీలకం అవుతాడని పేర్కొన్నారు. అతడి ఆటతీరు బాగుంటుందని, అందుకే ఆసీస్ ప్రజలు అతడిని అభిమానిస్తారని చెప్పారు. 2020-21 పర్యటనలో పంత్ 97, 89 పరుగుల ఇన్నింగ్సులతో అదరగొట్టిన సంగతి తెలిసిందే.
Similar News
News November 7, 2025
స్వర్గమంటే ఇదే.. హిమాచల్ అందాలు చూడండి!

వింటర్ వెకేషన్‌కు విదేశాలకు వెళ్లే పర్యాటకులను ఆకర్షించేందుకు హిమాచల్ ప్రదేశ్ టూరిజం సంస్థలు స్థానిక అందాలను SMలో పంచుకుంటున్నాయి. ప్రస్తుతం అక్కడ చెట్ల ఆకులన్నీ నారింజ రంగులోకి మారి, ప్రశాంత వాతావరణంతో భూతల స్వర్గంలా మారింది. ‘ఇది నార్వే కాదు.. హిమాచల్‌ప్రదేశ్’ అంటూ ‘Go Himachal’ పోస్ట్ చేసిన ఫొటోలు ఆకట్టుకుంటున్నాయి. ఈ సీజన్లో కులు మనాలీ, సిమ్లా వంటి ప్రదేశాలు పర్యాటకులతో కిటకిటలాడనున్నాయి.
News November 7, 2025
శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీలో ఉద్యోగాలు

తిరుపతిలోని <
News November 7, 2025
హనుమాన్ చాలీసా భావం – 2

రామదూత అతులిత బలధామా |
అంజనిపుత్ర పవనసుత నామా ||
ఇది ఆంజనేయుడి గొప్పదనాన్ని వివరిస్తుంది. హనుమాన్ రాముడికి నమ్మకమైన దూత(రామదూత). ఆయన బలం కొలవలేనిది, అపార శక్తిమంతుడు(అతులిత బలధామా). ఆయన అంజనీదేవి కుమారుడు(అంజనిపుత్ర), వాయుదేవుని పుత్రుడు(పవనసుత). శ్రీరాముడి విజయం, ధర్మ స్థాపనలో హనుమంతుని పాత్ర కీలకం. ఆయనను స్మరిస్తే శక్తి, విజయం లభిస్తాయి. <<-se>>#HANUMANCHALISA<<>>


