News April 1, 2024

పంత్‌కు రూ.12లక్షలు ఫైన్

image

ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్‌కు రూ.12లక్షలు ఫైన్ పడింది. రెండు వరుస పరాజయాల తర్వాత చెన్నై సూపర్ కింగ్స్‌పై గెలిచి ఢిల్లీ బోణీ కొట్టింది. అయితే ఈ మ్యాచ్‌లో ఆ జట్టు స్లో ఓవర్ రేట్ నమోదు చేసింది. దీంతో కెప్టెన్‌కు ఫైన్ పడింది. ఈ సీజన్‌లో ఇప్పటికే గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు కూడా స్లో ఓవర్ రేట్ కారణంగా రూ.12లక్షలు జరిమానా పడింది. పంత్ రెండో కెప్టెన్‌గా నిలిచారు.

Similar News

News March 26, 2026

మొదలైన SRHvsLSG టికెట్ల సేల్స్

image

IPL-2026 సందడి మొదలైంది. ఏప్రిల్ 5న హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరిగే SRHvsLSG మ్యాచ్ టికెట్లు రిలీజ్ అయ్యాయి. District యాప్‌ ద్వారా ఆన్‌లైన్‌లో టికెట్లను <>బుక్<<>> చేసుకోవచ్చు. రూ.850 నుంచి రూ.23,000వరకు టికెట్ ధరలున్నాయి. సొంత గడ్డపై ఆరెంజ్ ఆర్మీ ఆడే తొలి మ్యాచ్ ఇదే.

News March 26, 2026

విశాఖకు చేరుకున్న భారీ నౌకలు

image

AP: గ్యాస్, పెట్రోల్ ఇబ్బందుల నేపథ్యంలో విశాఖ తీరానికి భారీ LPG, చమురు నౌకలు చేరుకున్నాయి. 47 వేల టన్నుల ఎల్‌పీజీతో BW Birch షిప్, 28 వేల టన్నుల క్రూడాయిల్‌తో MT Petroit షిప్ పోర్టుకు వచ్చాయి. యూఏఈ నుంచి ఈ రెండు నౌకలు ఈ నెల 20న బయలుదేరాయి. మధ్యలో వడినార్, ముంద్రా పోర్టుల్లో కొంత LPG, క్రూడ్‌ను దిగుమతి చేశాయి. తాజాగా వైజాగ్‌ హార్బర్ మౌత్‌లో లంగరేశాయి.

News March 26, 2026

రోజులో 2 గంటలు ట్రాఫిక్‌లోనే టెకీ జీవితం

image

గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ (GCCs) విస్తరణతో హైదరాబాద్ ఐటీ రంగం దూసుకుపోతోంది. అయితే ఇది ఉద్యోగుల ప్రయాణ సమయాన్ని పెంచేసిందని తాజా నివేదిక వెల్లడించింది. HYDలో ఒక్క ఐటీ ఉద్యోగి ఒకవైపు ప్రయాణానికే సగటున 59.5 నిమిషాలు వెచ్చిస్తున్నారు. అంటే రోజుకు దాదాపు రెండు గంటలు రోడ్ల మీద ట్రాఫిక్‌లోనే గడిచిపోతోంది. బెంగళూరు(67.5M), ఢిల్లీ(67.5M) స్థాయిలో హైదరాబాద్‌లోనూ ప్రయాణ సమయం పెరగడం ఆందోళన కలిగిస్తోంది.