News November 26, 2024

ఢిల్లీని వీడుతూ పంత్ ఎమోషనల్ పోస్ట్

image

IPL వేలంలో లక్నోకు వెళ్లిపోయిన రిషభ్ పంత్ ఢిల్లీ అభిమానులను ఉద్దేశిస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ‘టీనేజర్‌గా ఇక్కడ అడుగుపెట్టి 9 ఏళ్లలో ఎంతో ఎత్తుకు ఎదిగాను. అందుకు అభిమానులే కారణం. మీరు ఎల్లప్పుడూ నాకు మద్దతుగా నిలిచారు. కఠిన సమయాల్లో అండగా ఉన్నారు. వేరే జట్టుకు వెళ్తున్నా మీ ప్రేమను గుండెలో పదిలంగా దాచుకుంటా. మిమ్మల్ని ఎప్పటిలాగే అలరిస్తా’ అని పంత్ రాసుకొచ్చారు.

Similar News

News November 27, 2025

వైట్ హౌస్ వద్ద కాల్పుల కలకలం.. లాక్ డౌన్

image

వాషింగ్టన్‌(US)లోని వైట్ హౌస్ వద్ద కాల్పులు కలకలం రేపాయి. దుండగుల కాల్పుల్లో ఇద్దరు జాతీయ భద్రతాదళ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. ఓ అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాల్పుల నేపథ్యంలో వైట్ హౌస్‌ను లాక్ డౌన్ చేశారు. ఘటన జరిగినప్పుడు అధ్యక్షుడు ట్రంప్ ఫ్లోరిడాలో ఉన్నారు. దేశ రాజధానిలో నేరాల కట్టడికి ట్రంప్ వాషింగ్టన్ అంతటా వేలాది మంది సైనికులను మోహరించిన తరుణంలో కాల్పులు జరగడం గమనార్హం.

News November 27, 2025

కృష్ణా నదీ జలాలపై హక్కులను వదులుకోం: సీఎం

image

AP: కృష్ణా నదీ జలాలపై రాష్ట్ర హక్కులను వదులుకునేది లేదని CM చంద్రబాబు స్పష్టం చేశారు. దీనిపై బలమైన వాదనలు వినిపించాలని జలవనరుల శాఖ అధికారుల సమీక్షలో దిశానిర్దేశం చేశారు. నీటి కేటాయింపుల్లో ఎలాంటి మార్పులకు వీలులేదని, చట్టపరంగా దక్కిన వాటాను కొనసాగించాల్సిందేనని చెప్పారు. ఏటా వేలాది <<16807228>>TMC<<>>ల జలాలు సముద్రంలో కలుస్తున్నందున వరద జలాల వినియోగంలో పొరుగు రాష్ట్రాలతో సామరస్యంగా వ్యవహరించాలన్నారు.

News November 27, 2025

హీరోయిన్ కూడా మారారా!

image

‘బలగం’ ఫేమ్ వేణు తెరకెక్కించనున్న ఎల్లమ్మపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో కీర్తీ సురేశ్ నటిస్తున్నారని ప్రచారం జరగ్గా, ఆ వార్తలను ఆమె తాజాగా కొట్టిపడేశారు. దీంతో ఇన్నాళ్లు ఈ మూవీ హీరోల పేర్లే మారాయని, ఇప్పుడు హీరోయిన్ కూడా ఛేంజ్ అయ్యారా? అని సినీ అభిమానులు చర్చించుకుంటున్నారు. ఈ సినిమాలో హీరోగా చేస్తారని నితిన్, నాని, బెల్లంకొండ సాయి, శర్వానంద్ పేర్లు వినిపించి DSP దగ్గర ఆగిన విషయం తెలిసిందే.