News April 1, 2025
పంత్ ఫ్లాప్ షో.. రూ.27 కోట్లు.. 17 రన్స్

IPL హిస్టరీలోనే అత్యధిక వేతనం(రూ.27 కోట్లు) తీసుకుంటున్న లక్నో కెప్టెన్ రిషభ్ పంత్ ఫ్లాప్ షో కొనసాగుతోంది. 3 మ్యాచ్లలో 17 రన్స్(DCపై 0, SRHపై 15, PBKSపై 2) మాత్రమే చేశారు. దీంతో ఆ జట్టు ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కీపర్, కెప్టెన్గానూ ఆకట్టుకోవడం లేదని మండిపడుతున్నారు. ఇతనొక ఓవర్ రేటెడ్ ప్లేయర్ అని ఫైరవుతున్నారు. తర్వాతి మ్యాచ్లలోనైనా పుంజుకోవాలని కోరుకుంటున్నారు.
Similar News
News April 3, 2025
జనాలను ఫూల్స్ చేస్తున్న చంద్రబాబు: రోజా

AP: ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా సీఎం చంద్రబాబు జనాలను ఫూల్స్ చేస్తున్నారని వైసీపీ నేత రోజా విమర్శించారు. సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చడం చేతకాకపోతే పదవి నుంచి దిగిపోవాలని ఆమె డిమాండ్ చేశారు. ‘చంద్రబాబు ఈవీఎంలను మేనేజ్ చేస్తారు కానీ కరువును మాత్రం చేయలేకపోతున్నారు. కరువుతో చాలా జిల్లాలు అల్లాడిపోతున్నా పట్టించుకోవడం లేదు. బాబు చెప్పే మాటలకు, చేసే పనులకు అసలు సంబంధమే లేదు’ అని ఆమె ఫైర్ అయ్యారు.
News April 3, 2025
ఏప్రిల్ 3: చరిత్రలో ఈరోజు

1955: ప్రముఖ నేపథ్య గాయకుడు హరిహరన్ జననం
1962: నటి జయప్రద జననం
1973: నటుడు, కొరియోగ్రాఫర్ ప్రభుదేవా జననం
1964: భారత మాజీ క్రికెటర్ అజయ్ శర్మ జననం
1680: మహారాష్ట్ర సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మరణం
1973: కొరియోగ్రాఫర్, దర్శకుడు, నటుడు ప్రభుదేవా జననం
1973: భారత మాజీ క్రికెటర్ నీలేష్ కులకర్ణి జననం
News April 3, 2025
జైస్వాల్ ముంబైని వీడటానికి కారణం అదేనా?

యువ క్రికెటర్ జైస్వాల్ <<15967764>>ముంబైని వీడి గోవా జట్టులో<<>> చేరనున్నారని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ముంబై టీమ్తో ఆయనకు ఏర్పడిన విభేదాలే దీనికి కారణమని తెలుస్తోంది. క్రికెట్ వర్గాల ప్రకారం.. ముంబై-విదర్భ మధ్య జరిగిన రంజీ ట్రోఫీ సెమీ ఫైనల్ మ్యాచ్కి జైస్వాల్ మోకాలి నొప్పి పేరిట దూరమయ్యారు. ఆ మ్యాచ్లో ముంబై ఓడింది. దాంతో అసోసియేషన్ పెద్దలకు, జైస్వాల్కు మధ్య వాగ్వాదం జరిగినట్లు సమాచారం.